రామ్మోహన్ వివాహ విందులో వైసిపి నేత, బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు, శ్రీశ్రావ్యల వివాహ రిసెప్షన్‌ ఆదివారం నిమ్మాడలో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ప్రత్యేక అతిథిగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వచ్చారు. నూత న వధూవరులను ఆశీర్వదించారు. బాలకృష్ణ విక్టరీ చేతులు ఊపుతూ.. ఒక్కోసారి చేతులు జోడిస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గుర్రపు బగ్గీపై రామ్మోహన్ నాయుడు-శ్రీశ్రావ్య: నోరూరించే వంటకాలు

Balakrishna special attraction in Rammohan Naidu's dinner

సొంతింటికి వచ్చినట్లుందని..

రామ్మోహన్ నాయుడు రిసెప్షన్‌కు రావడం సొంతింట పెళ్లికి వచ్చినట్లుగా ఉందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడుతో ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని వచ్చానన్నారు.

ప్రముఖుల తాకిడి దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ బ్రహ్మారెడ్డి, డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎండ తీవ్రత దృష్ట్యా వేలాది మజ్జిగ ప్యాకెట్లను, వాటర్ బాటిల్స్‌ను అందించారు. బాణసంచాల సందడితో ప్రాంగణం మార్మోగింది. రామ్మోహన్ నాయుడు వివాహ విందుకు మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత సిరియా సాయిరాజ్ కూడా హాజరయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hindupuram MLA and Actor Nandamuri Balakrishna special attraction in Rammohan Naidu's Marriage dinner.
Please Wait while comments are loading...