హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాలతో ప్రజాసేవ, సినిమాలతో వినోదం: లేపాక్షిలో బాలకృష్ణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: అనంతపురం జిల్లాలో నేటి నుంచి రెండు రోజులు జరగనున్న లేపాక్షి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా పానేశ్వరుడు, దుర్గామాతలను భక్తులు దర్శించుకుంటున్నారు.

ముందుగా లేపాక్షిలో జటాయువు మోక్ష ఘాట్ రోడ్డును బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలతో ప్రజాసేవ, సినిమాల ద్వారా వినోదం అందించడమే తన లక్ష్యమని అన్నారు. రాజకీయాలు, సినిమాల ద్వారా తాను ప్రజలకు చేయగల్గినంత సేవ చేస్తానని అన్నారు.

ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా ఈ లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. భగవంతుడు కల్పించిన అవకాశం వల్లే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తనకు ఆధ్యాత్మిక చింతన ఉందన్న విషయం అందరికీ తెలుసని, రోజుకి సుమారు రెండు గంటలపాటు పూజ చేస్తానని, అందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

యాంత్రిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్లించాలని బాలకృష్ణ అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలు శనివారం సాయంత్రం 5.30 గంటలకు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ లేపాక్షి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, సినీ నటులు, కళాకారులు పాల్గొననున్నారు.

Balakrishna started gramotsavam at lepakshi festival

తన నియోజకవర్గంలో రూ. 4 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హెరిటేజ్‌ రన్‌ జరిగింది. హెరిటేజ్‌ రన్‌లో సినీనటుడు బాలకృష్ణ, మంత్రి పరిటాల సునీత, యువతీ యువకులు పాల్గొన్నారు. లేపాక్షిలోని నంది విగ్రహం నుంచి సభాస్థలి వరకు హెరిటేజ్‌ రన్ కొనసాగింది. ఈ రన్‌లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ఉత్సవాల్లో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అభిమానులకు కనువిందు చేయనున్నారు. లేపాక్షి ఉత్సవాలకు రావాల్సిందిగా ఇప్పటికే అటు కేంద్ర మంత్రలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు మంత్రులను బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించారు.
లేపాక్షి ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు పాల్గొంటారని బాలకృష్ణ వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించింది.

English summary
Balakrishna started gramotsavam at lepakshi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X