గడ్డపార చేతబట్టి అభివృద్ధి పనులకు బాలకృష్ణ శంకుస్థాపన: ఈలలు వేసిన మహిళలు

అనంతపురం: తెలుగుదేశం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తాను ప్రానినిథ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజులుగా హిందూపురంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం కూడా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య గడ్డపార చేతబట్టిన బాలకృష్ణ భూమిని తవ్వి అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాగా, తమ అభిమాన నటుడు, నేత బాలయ్య గడ్డపార చేతబడ్డగానే పురుషులతో పాటు మహిళలు కూడా ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు.

అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

Balakrishna visits Hindupur

ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, రాజధాని తరలింపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో ‘మీ ఇంటికి- మీ భూమి' కార్యక్రమంపై తహసీల్దార్లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

విజయవాడకు రాజధాని తరలింపులో పురోగతి, భూసేకరణ, ఆఫీసుల తరలింపు, తాత్కాలిక వసతి ఏర్పాట్లపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ భాస్కర్‌ ప్రామాణిక్‌ చంద్రబాబును కలిసి చర్చలు జరపనున్నారు.

కాగా, కొల్లేరు సరస్సు పరిధిని 5వ కాంటూరు నుంచి మూడో కాంటూరుకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు సమావేశంలో తీర్మానించారు. రాజధాని కమిటీ సభ్యులతో కూడా చంద్రబాబు సమీక్ష జరపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+