బాలాపూర్ లడ్డు 9.26 లక్షలు: దక్కించుకున్న తీగల

వేలంలో లడ్డూను దక్కించుకున్న తీగల మాట్లాడుతూ.. వేలం పాటలో లడ్డూను కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. లడ్డూను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తదితరులకు పంపిణీ చేస్తానని చెప్పారు. లడ్డూ వేలంపాటలో వచ్చిన డబ్బును బాలాపూర్ గ్రామ అభివృద్ధికి ఉపయోగించడం అభినందనీయమన్నారు.
కాగా, ట్యాంకుబండ్ పైన నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి భారీగా నిలిచిపోయిన గణనాథులను ట్యాంకుబండు ఎన్టీఆర్ మార్గం సమీపంలో క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. భక్తులు, యువకులు పెద్ద ఎత్తున నిమజ్జనానికి తరలి వచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ నృత్యాలు చేస్తున్నారు.
మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని ఈ రోజు నిమజ్జనానికి తరలించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం పూజలు చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications