టిడిపిలో టిక్కెట్ల లొల్లి: చిరంజీవి ఫ్లెక్సీ చించిన కార్యకర్తలు

Balayya meets Chandrababu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. టిడిపి మూడో జాబితాలో బాలకృష్ణ పేరు ఉన్న విషయం తెలిసిందే. ఆయన హిందూపురం అసెంబ్లీ నియోకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. బాలయ్య ఎన్నికల ప్రచార ప్రణాళికపై బాబుతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

గుంతకల్లు టిడిపి కార్యాలయంపై దాడి

గుంతకల్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్‌ను పొత్తులో భాగంగా బిజెపికి ఇవ్వవద్దని హంగామా చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

అనంతలో యూత్ కాంగ్రెసు నేతల దాడి

మరోవైపు కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర లిస్టు పైన సీమాంధ్ర నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయం పైన యూత్ కాంగ్రెసు నేతలు దాడి చేశారు. తమ నేతకు టిక్కెట్ కేటాయించలేదని పలువురు ఆందోళనకు దిగారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి ఫ్లెక్సీలను చించివేశారు.

ఏలూరులోని కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఏలూరు టిక్కెట్‌ను పద్మరాజుకు కేటాయించడం సరికాదని వారు నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+