బాలకృష్ణకు ఆదాయపన్ను షాక్!: ఫ్యామిలీ బ్యాగులో రూ.10 లక్షల పాత నోట్లు, లెక్కలు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులను శనివారం తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఐటీ అధికారులు విచారించారు.
తిరుపతి: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులను శనివారం తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఐటీ అధికారులు విచారించారు. వారి వద్ద రూ.10 లక్షల రద్దయిన నోట్లు గుర్తించారు. వాటికి బాలకృష్ణ కుటుంబ సభ్యులు లెక్కలు చెప్పారు.
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో బాలకృష్ణ కుటుంబ సభ్యులు స్పైస్ జెట్ విమానంలో దిగారు. అందులో బాలయ్య సతీమణి వసుంధర కూడాా ఉన్నారు. వారు హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్నారు.

వారి వద్ద పాత కరెన్సీ నోట్లు ఉన్నాయన్న సమాచారంతో ఆదాయపన్ను శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకొని తనిఖీ చేశారు. వారి వద్ద రూ.10 లక్షల పాతన కరెన్సీ నోట్లను గుర్తించారు. వాటికి బాలయ్య సతీమణితో పాటు కుటుంబ సభ్యులు లెక్కలు చూపించారు. వాటిని తాము శ్రీవారి హుండీలో కానుకలుగా వేసేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పక్కా ఐటీ లెక్కలు చూపడంతో వారిని వదిలేశారు.
శ్రీవారి దర్శనం కోసం ఆనందంగా వెళ్తున్న బాలయ్య భార్య వసుంధర, మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఐటీ అధికారులు అనుకోని విధంగా షాకిచ్చారు. ఐటీ అధికారి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో హుటాహుటిని అధికారులు వచ్చారు.
మీ వద్ద పాత కరెన్సీ ఉందని సమాచారం ఉందని, తనిఖీ చేయాలని చెప్పారు. దానికి బాలకృష్ణ కుటుంబ సభ్యులు సహకరించారు. దీంతో వారు తనిఖీ చేయగా పదిలక్షల రూపాయలు బ్యాగులో దొరికాయి. అధికారులు వారిని వివిధ రకాలుగా ప్రశ్నించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications