టీడీపీలో ఆ ఇద్దరు మినహా అందరూ సిద్దంగా ఉన్నారు - బాలినేని..!!

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే టీడీపీ నుంచి ఇద్దరు మినహా మిగిలిన వారంతా సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ నుంచి 45 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉంటే డబ్బులు ఇచ్చి నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు కొనుక్కున్నారని ప్రశ్నించారు. హైప్ చేసుకోవం మినహా ప్రచారంలో నిజం లేదన్నారు. సీఎం జగన్ నాయకత్వం పైన పార్టీలోని ప్రతీ ఎమ్మెల్యేకు నమ్మకం ఉందని..అందరూ సంతోషంగా ఉన్నారని బాలినేని చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మైండ్ గేమ్ తీవ్రతరం చేసింది. వైసీపీ నుంచి 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు ప్రచారం చేసారు. దీని పైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇదే అంశం పైన స్పందించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీ తెచ్చుకోవాలనుకుంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప అందరూ వస్తారని వ్యాఖ్యానించారు.

Balilneni Srinivasa Reddy made serious comments against TDP Chief Chandra Babu

మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై జరగుతున్న ప్రచారాలు మీడియా సృష్టి తప్ప ఏమీ లేదని స్పష్టం చేసారు. సంక్షేమ పధకాలతో రాష్ట్రం అప్పుల పాలైందని చంద్రబాబు అంటున్నారని..గత ప్రభుత్వ హాయంలో ఉన్న అప్పులు ఎంతో చెప్పాలన్నారు. ఇప్పుడు తీసుకున్న అప్పులు ఎంతో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చిన అప్పులు దేని కోసం ఖర్చు చేసారో ప్రజలకు సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్ చేసారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ..ప్రజలకు చెప్పిన ప్రతీ మాట నిలబెట్టుకున్నామని..కాబట్టే ప్రజల దగ్గరకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని బాలినేని వివరించారు. ప్రజలకు ఇళ్ల స్దలాలు ఇవ్వాలన్నా ఎన్నో కుయుక్తులు పన్ని కోర్టులకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదల స్థలాల పైన కోర్టుకు వెళ్లలేదని టీడీపీ నేతలు ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ఆదరణతో కుట్రలు..అసత్య ప్రచారంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోందని బాలినేని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+