Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒంగోలు ఎంపీ సీటుపై బాలినేని రాజీ ఫార్ములా - జగన్ అంగీకరించేనా...!!

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారం పార్టీలో సంచలనంగా మారుతోంది. సీట్లు దక్కని కొందరు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. సీనియర్లు తమ సిఫార్సులను పట్టించుకోకపోవటం పైన ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీ విషయంలో మాజీ మంత్రి బాలినేని కొంత కాలంగా సిట్టింగ్ ఎంపీ మాగుంటకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదం వేళ బాలినేని కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు: ఒంగోలు ఎంపీ మాగుంట స్థానంలో మరొకరిని బరిలోకి దించాలనేది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికి ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా వైసీపీ ఆరు జాబితాలను ప్రకటించింది. అందులో ఒంగోలు సీటు పైన క్లారిటీ ఇవ్వలేదు. ఒంగోలు ఎంపీగా మాగుంటను మార్చటం పైన మాజీ మంత్రి బాలినేని అంగీకరించటం లేదు.

Balineni Srinivasa Reddy made new proposal over Ongole MP seat for next Elections

మార్చాలని భావిస్తే స్థానికంగా ఉన్న వారికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేసారు. దీని పైన పార్టీ సర్వేలు చేయించింది. ఎంపీ సీటు మాగుంట కోసం తాను కోరారనని, ఎంపీ సీటు గురించి ఎవరికీ పట్టనప్పుడు తనకు మాత్రం ఎందుకని బాలినేని వ్యాఖ్యానించారు. పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేసారు.

ఎంపీగా బాలినేని..?: అయితే, తాజాగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలో దించాలని పార్టీ నిర్ణయంగా తెలుస్తోంది. అదే సమయంలో ఒంగోలుతో పాటుగా జిల్లాలో పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తగా ప్రకటన చేసింది. దీని పైన బాలినేని మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసారు. చెవిరెడ్డికి ఎంపీ సీటు ఇవ్వటాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.

ఇక..ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాలినేని నిర్ణయం ఏంటనేది రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో బాలినేని కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా తానే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారని సమాచారం. దీని ద్వారా ఇతరులకు అవకాశం లేకుండా చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతల ద్వారా ఈ ప్రతిపాదన సీఎం వద్దకు పంపినట్లు సమాచారం.

జగన్ నిర్ణయంపై ఉత్కంఠ: ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్దిగా ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు బాలినేని తానే స్వయంగా పోటీకి దిగుతానని చెప్పటం తో సీఎం జగన్ ఇందుకు అంగీకరిస్తారా లేదా అనేది జిల్లాలో ఆసక్తి కర అంశంగా మారుతోంది. బాలినేనికి ఎంపీ సీటు కేటాయిస్తే ఎమ్మెల్యేగా మరో ఇద్దరి పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

ఇద్దరూ ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల వారసులే. వీరికి సీటు ఇచ్చే అంశంలో జగన్ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ సమయంలో బాలినేని తాజా ప్రతిపాదన పైన ఇప్పుడు సీఎం ఏ రకంగా స్పందిస్తారు.. బాలినేని ఎంపీగా పోటీ చేస్తే ఒంగోలు ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+