వైసీపీ బాధ్యతల నుంచి తప్పుకున్న మాజీ మంత్రి బాలినేని..!?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో సీనియర్ గా.. సీఎం జగన్ బంధువు అయిన బాలినేని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జగన్ పార్టీ ఏర్పాటు నుంచి బాలినేని ఆయనతో కలిసి నడిచారు. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన బాలినేని గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే పార్టీ ప్రాంీయ సమన్వయకర్త పదవి నుంచి బాలినేని తప్పుకుంటున్నట్లు సమాచారం.

Balineni Srinivasa Reddy Sensational Decision ahead Assembly Polls, shock for YSRCP

బాలినేని కీలక నిర్ణయం: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రావు మనస్థాపానికి గురయ్యారు. ప్రస్తుతం బాలినేని వైసీపీ రీజనల్ కో ఆర్డినేలర్ గా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. జగన్ కోసం కాంగ్రెస్ లో మంత్రి పదవిని సైతం వదులుకొని వచ్చిన బాలినేని అప్పటి నుంచి వైసీపీలో క్రియాశీలకంగా మారారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తొలి కేబినెట్ లో కీలక మంత్రిగా పని చేసారు. కేబినెట్ విస్తరణ సమయంలో బాలినేనిని తప్పించి అదే జిల్లాకు చెందిన సురేష్ ను కొనసాగించటం పైనా అప్పట్లో బాలినేని నొచ్చుకున్నారు. ఆ తరువాత సీఎం జగన్ తో భేటీ తరువాత ఆయన తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో బాలినేని తీసుకున్న నిర్ణయం పార్టీలో కలకలం రేపుతోంది.

బాలినేని నిర్ణయం వెనుక: బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్లో కీలకంగా మారారు. కోటంరెడ్డి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వటంలో ప్రధాన భూమిక పోషించారు. నెల్లూరు జిల్లాలో పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ చేసారు.

తాజాగా సీఎం జగన్ నిర్వహించిన ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ మధ్య కాలలంలో మైత్రీ మూవీస్ లో బాలినేని పెట్టుబడులు ఉన్నాయంటూ జనసేన చేసిన ఆరోపణల విషయంలోనూ బాలినేని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు స్వల్ప అస్వస్థతతో బాలినేని హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.

నిర్ణయంలో మార్పు ఉంటుందా: ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా స్వాగతం పలికేందుకు వెళ్లిన సమయంలో బాలినేనిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో బాలినేని ఆగ్రహంతో వెనక్కు వెళ్లిపోయారు. సీఎంఓ జోక్యంతో తిరిగి సీఎం పాల్గొన్న సభా వేదిక వద్దకు బాలినేని తిరిగి వచ్చారు.

ముఖ్యమంత్రి నిధులు విడుదల చేసే సమయంలో బాలినేని తో ఆ బటన్ నొక్కించారు. ఆ తరువాత బాలినేని ఇప్పుడు రీజనల్ కో ఆర్డినేటర్ పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించటంతో..వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. తన నిర్ణయం పైన బాలినేని స్పందించాల్సి ఉంది. బాలినేని గౌరవానికి పార్టీలో భంగం వాటిల్లదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+