హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'తెలంగాణకే తొలి ప్రాధాన్యత, మెట్రో రైలు డ్రీమ్ ప్రాజెక్ట్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. శ్రయమేవ జయతే పథకంతో కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు సంక్షేమ పథకాలు నేరుగా అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి చేయించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో బీడీ కార్మికుల గృహ నిర్మాణానికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 5వ తేదీన ట్రేడ్ యూనిట్లు తలపెట్టిన ఆందోళన విరమింప చేసే ప్రయత్నం చేస్తామన్నారు.

లేబర్ ఇన్స్‌పెక్టర్లు యజమానులకు కొమ్ము కాయడమే కార్మికులకు శాపంగా మారిందన్నారు. కార్మికులు శ్రమదోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్ లైన్లో కార్మికుల సంక్షేమ పథకాలు పెడతామని చెప్పారు. 42 కోట్ల మంది అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారని, వారిలో నైపుణ్యాలు పెంపొందించాల్సి ఉందన్నారు.

Bandaru Dattatreya plans KCR meeting with PM Modi

నిపుణులైన కార్మికులు అవసరమని ఆస్ట్రేలియా కోరిందని, అక్కడ గని కార్మికులు పెద్ద సంఖ్యలో కావాలని చెప్పారన్నారు. పిల్లల్లో చిన్న నాటి నుండే వృత్తి విద్యను బోధించాలని, అప్పుడే నిపుణులు తయారవుతారని చెప్పారు. కాగా, బండారు దత్తాత్రేయ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రధాని మోడీతో భేటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అభినందించడం కర్తవ్యం: వెంకయ్య

దేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన స్వామినాథన్‌ అవార్డులు ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త ఎస్‌ఎల్‌ గోస్వామికి స్వామినాథన్‌ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఎవరైనా ప్రతిభను కనబరిచినప్పుడు వాళ్లను గుర్తించి అభినందించడం సమాజం కర్తవ్యమన్నారు. సంస్కారం కలిగిన సమాజం అలాంటి వారికి ఒక నమస్కారం పెడుతుందన్నారు. అదే మన భారతీయ సంస్కారమన్నారు. ప్రతిభను గుర్తించి, గౌరవిస్తే దానివల్ల మిగతావారు స్ఫూర్తి పొందుతారని అభిప్రాయపడ్డారు.

మనం కూడా ఇలా ప్రతిభా విశేషాలు కనబరిస్తే మనల్ని సమాజం గుర్తిస్తుందని ఆయన అన్నారు. దేశ ఆదాయంలో 43.3 శాతం వడ్డీలకే పోతోందని, కొత్త ఉత్పత్తులతో దేశ ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పారు.

English summary
Union minister of state for labour and employment Bandaru Dattatreya offered to arrange a meeting between Prime Minister Narendra Modi and Telangana Chief Minister K. Chandrasekhar Rao to sort out the power and other issues with Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X