టిడిపిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేబండారు: లోకసభకి ఆదాల?

రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, అందుకే తెలుగుదేశం అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నట్టు సత్యానంద రావు చెప్పారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గుడిపూడి రవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన రాజును కూడా పార్టీలో చేర్చుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఆదాల?
నెల్లూరు లోక్‌సభ స్థానానికి టిడిపి అభ్యర్థిగా ఆదాల ప్రభాకర రెడ్డిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన టిడిపిలో చేరే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. ముందు ఆయనను నెల్లూరు రూరల్ అభ్యర్థిగా నిలపాలని అనుకొన్నా ఆదాల ఎంపీ సీటుపై ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
27న డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రకటన
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఈ నెల 27న తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. డిఎల్ రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 27 నాటికి 35 సంవత్సరాలు అవుతోంది. అదేరోజు ఆయన నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications