పాపం మోడీకే వదిలేద్దాం, ప్రత్యేక దేశంగా గెంటేయండి!: శివాజీ సంచలనం

చిత్తూరు/విజయవాడ: ఏపీకి ఇస్తే ప్రత్యేకహోదా ఇవ్వాలని, లేదంటే ప్రత్యేక దేశంగా వెలివేయాలని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య అధ్యక్షులు, సినీ నటుడు శివాజీ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నేడు చేబట్టిన బంద్ పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

బంద్ విజయవంతమైందన్నారు. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారన్నారు. పార్టీలు, నేతలకతీతంగా స్పందించారని చెప్పారు. ప్రత్యేక హోదాను అడ్డుకున్న పాపంలో రాష్ట్రానికి చెందిన నేతలు ఎవరూ పాలుపంచుకోవద్దని సూచించారు.

హోదాను ఇవ్వని పాపం ప్రధాని మోడీ, బీజేపీకి వదిలేద్దామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని 5 కోట్ల మంది సంతోషంగా లేరన్నారు. తమ భావితరాల జీవితాలు సంతోషంగా లేనప్పుడు ఎవరికోసం ఈ దేశంలో ఉండాలన్నారు.

భారతీయులుగా పుట్టిన తమను కొంతమంది భారతీయులే మోసం చేసినప్పుడు ఏ భరతమాత పేరు చెప్పుకోవాలన్నారు. స్వార్థాలు పక్కన పెట్టి నేతలంతా ప్రత్యేక హోదా కోసం పని చేయాలన్నారు. ప్రజల ఆందోళన ప్రత్యక్షంగా చూసిన తాను ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు. కాగా, ఏపీలో బంద్ విజయవంతమైంది.

ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కమిటీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర బంద్ అన్ని జిల్లాల్లో విజయవంతమైంది.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి వరకు తన క్యాంప్ కార్యాలయంలోనే ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర సమస్యలపై సమీక్షలు నిర్వహించారు.

ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. సినిమా హాళ్లలో పగటి ఆటలు రద్దయ్యాయి.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

మధ్యాహ్నం వరకు విజయవాడ నగరంలోను, జిల్లాలో పలు ప్రాంతాల్లో బస్సుల రాకపోకలకు తీవ్ర అవరోధం కలిగింది.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

బెజవాడ బస్ స్టేషన్ ద్వారం వద్ద ధర్నా చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, పిసిసి అధ్యక్షుడు కె రఘువీరా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

సిపిఎం సంఘీభావం తెలపగా సిపిఐ ఎంఎల్, కాంగ్రెస్, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

బంద్ సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా పలు ప్రాంతాల్లో 1100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

బంద్‌కు ఉభయ గోదావరి జిల్లాల్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించటంతో వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రోడ్లు జనం లేక వెలవెలబోయాయి. విద్యాసంస్థలను ఆందోళనకారులు మూయించారు. ఆర్టీసీ బస్సులు మాత్రం పాక్షికంగా తిరిగాయి.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. బంద్‌లో అన్ని సంఘాలు, పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్ధలతో సహా అన్నివర్గాలు భాగస్వాములు కావటం కన్పించింది. సిపిఐతో పాటు ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్, సిపిఎం, విద్యార్థి సంఘాలతో పాటు జిల్లా న్యాయవ్యాదులు కూడా విధులకు గైర్హాజరై బంద్‌లో పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

తెల్లవారు ఝాజామునుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఆర్టీసీ బస్సులు డిపోలను దాటి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

సిపిఐ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాక్షిక స్పందన కనిపించింది. వామపక్ష, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి.

ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

అన్ని పార్టీలు రాజకీయ జెండాల పక్కన పెట్టి ప్రత్యేక అజెండా లక్ష్యంగా సంఘాలు పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. ఈ బంద్‌లో టిడిపి, టిఎన్‌ఎస్‌ఎఫ్, ఎబివిపి మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

ఏపీకి ప్రత్యేకహోదాపై తక్షణం నిర్ణయం తీసుకోని పక్షంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును రాష్ట్రంలో తిరగనిచ్చేది లేదని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు.

ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

తిరుపతిలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు. ప్రధాని మోడీ ట్విట్టర్ చేతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు ప్రత్యేక హోదాపై ఎందుకు స్పందించడం లేదన్నారు.

 ప్రత్యేక హోదా కోసం బంద్

ప్రత్యేక హోదా కోసం బంద్

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ప్రకటించాలన్నారు. లేని పక్షంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+