చంద్రబాబు కోసం బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..!!

బండ్ల గణేష్. ప్రముఖ నటుడుగా.. నిర్మాత.. కాంగ్రెస్ నేతగా తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తం. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మహాపాదయాత్రకు బండ్ల గణేష్ సిద్దమయ్యారు. ఈ మేరకు ప్రకటన చేసారు. షాద్‌ నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక కారణం పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. గతంలో శ్రీవారికి మొక్కుకున్న మొక్కు తీర్చటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బండ్ల గణేష్ మహా పాదయాత్ర ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బండ్ల గణేశ్ ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మహా పాద యాత్రలో రోజూ నిర్దిష్ట దూరం నడవడం, భక్తులతో కలిసి శ్రీవారి నామస్మరణ, భక్తి వాతావరణంలో ప్రయాణమే లక్ష్యంగా ఈ పాదయాత్ర కొనసాగనుంది.

Bandla Ganesh maha pada yatra from Shadnagar to Tirumala on 19th of this month

ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కాలినడకన తిరుమల చేరుకుని, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కును సమర్పించుకుంటారు.అయితే, అసలు ఆ మొక్కు ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో బండ్ల గణేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబు నిర్దోషిగా విడుదల కావాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేశ్ సిద్ధమయ్యారు.

చంద్రబాబు పట్ల తనకున్న అభిమానాన్ని ఈ యాత్ర ద్వారా బండ్ల గణేశ్ చాటుకుంటున్నారు. అయితే, బండ్ల గణేష్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు పైన అభిమానం తో నాటి మొక్కు తీర్చుకునేందుకు యాత్ర చేస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బండ్ల గణేష్ నిర్ణయం పైన సోషల్ మీడియా వేదికగా స్పందన కనిపిస్తోంది. దీంతో.. బండ్ల గణేశ్ నిర్ణయం రాజకీయ, సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+