బెంగళూరు రేవ్ పార్టీ: డ్రగ్స్ సప్లై చేసిందెవరు? షాకింగ్ ఫోటోలతో టీడీపీ వర్సెస్ వైసీపీ!!
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ రేవ్ పార్టీలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఈ రేవ్ పార్టీలో లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీ ఇప్పుడు వైసిపి వర్సెస్ టిడిపి అన్నట్టుగా ఏపీ రాజకీయాలలో రచ్చ చేస్తుంది.
బెంగళూరు రేవ్ పార్టీ .. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై సూత్రధారులు మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఒక కారుపై ఉండడంతో ఇందులో వైసిపి నాయకులు ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ ఆరోపణలు
దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ స్టిక్కర్ ఎవరు ఎందుకు వినియోగించారో తనకు తెలియదని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్పినప్పటికీ ఈ వ్యవహారంలో వైసిపి నేతల మీద ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ దీనిని పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో వైరల్ చేస్తుంటే వైసీపీ కూడా టిడిపిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు @naralokesh అనుచరులే!
— YSR Congress Party (@YSRCParty) May 24, 2024
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు వీరిద్దరూ బెంగళూరు @JaiTDP ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులు
పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళీతో వీరికి… pic.twitter.com/wpjpZBv13Z
డ్రగ్స్ సప్లై చేసిన వారిలో టీడీపీ జై టిడిపి ఐటి ఫోరం వ్యక్తులు
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వారిలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు వీరిద్దరూ బెంగళూరు జై టిడిపి ఐటి ఫోరం కి చెందిన కీలక వ్యక్తులని, పూతలపట్టు టిడిపి అభ్యర్థి మురళితో వీరికి సత్సంబంధాలు ఉన్నాయని వీరంతా నారా లోకేష్ అనుచరులంటూ టార్గెట్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లై సూత్రధారులు నారా లోకేష్ అనుచరులేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టింది.
మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ రాజకీయ రంగు పులుముకుంది. ఇటు వైసీపీ అటు టీడీపీలు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా పోస్టింగులతో దుమ్మెత్తి పోస్తున్నారు.












Click it and Unblock the Notifications