ప్రేమించి పెళ్ళి చేసుకొంది,వేరే వ్యక్తి తో యువతికి వివాహం, ఎందుకిలా...

బంగ్లాదేశ్ కు చెందిన ఓ మైనర్ బాలికను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన బాలకృష్ణ అనే యువకుడిని ఆమె వివాహం చేసుకొంది.

ఒంగోలు:బంగ్లాదేశ్ కు చెందిన మైనర్ బాలికను ఒంగోలు పోలీసులు అరెస్టుచేశారు.ఒంగోలుకు చెందిన బాలకృష్ణ అనే యువకుడు మైనర్ బాలికను వివాహం చేసుకొన్నాడని పోలీసుల విచారణలో తేలింది.

బంగ్లాదేశ్ లోని జట్రాబరి అనే గ్రామానికి చెందిన స్టీటీ మండల్ ఇంటర్ చదువుతోంది.అయితే ఆమె సయ్యద్ ఇస్లాం సుమన్ బహరి అనే యువకుడిని ప్రేమించి నాలుగు నెలల క్రితం పెళ్ళిచేసుకొంది.

ఈ వివాహం ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు బెంగాల్ కు చెందిన బాలకృష్ణతో ఈ నెల 16, బెంగాల్ లో వివాహం చేశారు.బాలకృష్ణ వినుకొండ , కనిగిరి ప్రాంతాల్లో ఆర్ ఎం పి గా పనిచేస్తున్నాడు.ఆయన ప్రస్తుతం కనిగిరిలో నివాసం ఉంటున్నాడు.

bangladesh minor girl arrested in ongole

బెంగాల్ లో స్వీటీ మండల్ ను పెళ్ళిచేసుకొన్న బాలకృష్ణ అక్కడి నుండి ఈ ఏడాది జనవరి 26న, ఒంగోలుకు వచ్చాడు. బండ్లమిట్టలోని తన సమీప బంధువు ఇంట్లో ఉంటున్నాడు.

అతడితో పాటు మరికొంతమంది ఆ ఇంట్లో ఉంటున్నారు.ఈ ఇంట్లో ఉంటున్నవారంతా బెంగాల్ కు చెందినవారే. సమాచారం తెలుసుకొన్న పోలీసులు శుక్రవారం రాత్రి ఆ యువతితో పాటు వివాహం చేసుకొన్న బాలకృష్ణలను అదుపులోకి తీసుకొన్నారు.

బంగ్లాదేశ్ యువతికి భాష సమస్య కారణంగా పోలీసులు బెంగాల్ కు చెందిన వారిని తీసుకువచ్చి విచారించారు. దీంతో ఆ యువతి అసలు విషయాన్ని వెల్లడించింది.

యువతి మైనర్ కావడంతో జడ్జి ఎదుట పోలీసులు హజరుపర్చారు. చైల్డ్ హోమ్ కు తరలించాలని జడ్జి ఆదేశించారు.ఈ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ యువతిని చైల్డ్ హోమ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+