నేటి నుంచే రూ 2 వేల నోట్ల మార్పిడి - ఆర్బీఐ కీలక సూచన..!!
రూ 2 వేల నోట్ల మార్పిడి ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ రూ 2 వేల నోట్లను ఉప సంహరించుకుంటూ ప్రకటన చేసింది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆయా రూ.2000కరెన్సీ నోట్లను ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడం గానీ, మార్చుకోవడం గానీ చేయొచ్చు. ఇదే సమయంలో ఈ మార్పిడి కోసం ఆర్బీఐ నిబంధనలను స్పష్టం చేసింది. కొందరు వ్యాపారులు కొంత కాలం నుంచే 2,000 నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో బ్యాంకులు ద్వారా మార్పిడికి రద్దీ పెరుగుతోంది.
నేటి నుంచే ప్రారంభం:రూ 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో చోటు చేసుకున్నపరిణామాలను ఖాతాదారులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ అవసరమే లేదని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలతో పాటుగా పలు బ్యాంకుల్లో రెండు వేట నోట్ల మార్పిడికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ చెప్పినా ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు..పెట్రోలు బంకుల్లో రెండు వేట నోట్లను స్వీకరించేందుకు తిరస్కరిస్తున్నారు. దీంతో ఇప్పుడు బ్యాంకుల ద్వారా సాధ్యమైనంత త్వరగా రెండు వేల నోట్లను మార్చుకొనేందుకు ప్రాధాన్య కనిపిస్తోంది.

రోజుకు రూ 20 వేలు:సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎంత మొత్తంలో రూ.2000 నోట్లు ఎటువంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా డిపాజిట్ చేయొచ్చని పలు బ్యాంకులు స్పష్టత ఇచ్చాయి. ఈ రోజు (మే 23) నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ నిర్దేశిత లిమిట్ మేరకు ప్రతి రోజూ రూ.20 వేల విలువైన నోట్లు మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్బీఐ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అంతకుముందు ఎస్బీఐ కూడా రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడిపై ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.2000 నోట్ల డిపాజిట్లకు ఎటువంటి పత్రం నింపాల్సిన అవసరం లేదు. పాన్ లేదా ఆధార్ కార్డు కూడా చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, డిపాజిట్లు రూ.50 వేలు దాటితే పాన్ కార్డు సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ చెప్పిన అంశాన్ని గుర్తు చేస్తోంది.
రూ 50వేలు దాటితే పాన్...:ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను హడావుడిగా మార్చుకోవాల్సిన అవసరంలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. సాధారణంగానే బ్యాంక్‌ల్లో 50వేల కంటే ఎక్కువ మొత్తాలను డిపాజిట్ చేస్తే పాన్‌కార్డు తప్పనిసరి సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆయన గుర్తు చేశారు. నగదు డిపాజిట్లకు ప్రస్తుతం ఉన్న నిబంధనలనే 2వేల నోట్ల డిపాజిట్ విషయంలోనూ అనుసరించాలని బ్యాంక్‌లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఒక వ్యక్తి ఒకసారి 20 వేల వరకు మాత్రమే 2వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉందని ఆర్బీఐ చెప్పిన నేపథ్యంలో... ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా ఇలా 20వేల వరకు నోట్లను మార్చుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు ఆర్బీఐ సూచించింది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications