Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ-జనసేన మధ్య పొత్తులపై విస్తృతంగా బ్యానర్లు: బీజేపీ..వాట్ నెక్స్ట్?

అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం కొద్దిరోజులుగా హాట్ డిబేట్‌గా ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా చేసిన వన్‌సైడ్ లవ్ ట్రాక్ కామెంట్స్ చేసినప్పటి నుంచీ అందరి దృష్టీ జనసేన పార్టీ మీదే నిలిచింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికీ తాను సిద్ధమేనంటూ చంద్రబాబు స్పష్టం చేయడం- ఈ రెండు పార్టీల పొత్తు ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

2019లో వేర్వేరుగా..

2019లో వేర్వేరుగా..

అప్పటికే ఆయన జనసేన పార్టీ నెలకొల్పినప్పటికీ- ఎన్నికలకు దూరంగా ఉన్నారు. టీడీపీ-బీజేపీ కూటమికి అండగా నిలిచారు. 2019 ఎన్నికల నాటికి- జనసేన పూర్తిస్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దీనితో టీడీపీ-బీజేపీలతో పొత్తు ప్రసక్తే పెట్టుకోలేదు. మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ, వామపక్షాలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంది.. చేదు ఫలితాలను చవి చూసింది. జనసేన ఒకేఒక్క స్థానానికి పరిమితమైంది. పవన్ కల్యాణ్ సైతం రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు.

బంతి పవన్ కల్యాణ్‌ కోర్టులో..

బంతి పవన్ కల్యాణ్‌ కోర్టులో..

జనసేనతో పొత్తులపై తన వైపు నుంచి చంద్రబాబు ఫుల్ క్లారిటీతో ఉన్నారనేది తేలిపోయింది. దీనితో పొత్తుల బంతి పవన్ కల్యాణ్ కోర్టులో పడినట్టయింది. పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీ- బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలో దిగినా.. ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. పవన్.. కమల నాథుల్లో చేరిపోయారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. తాము బీజేపీతో పొత్తులో ఉన్నామంటూ మొన్నటికి మొన్న పవన్ కూడా స్పష్టం చేశారు.

ప్రభావం చూపని పొత్తు..

ప్రభావం చూపని పొత్తు..

బీజేపీ-జనసేన కూటమి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపట్లేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం భయపెట్టట్లేదు.. ఆందోళనకు గురి చేయట్లేదు. తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ రెండు చోట్ల కూడా ఈ కూటమి గట్టిపోటీ సైతం ఇవ్వలేకపోయింది. బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేసినా.. వైసీపీ మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణించలేదు. సునాయాస విజయాన్ని సాధించగలిగింది.

 బీజేపీతో కటీఫ్..?

బీజేపీతో కటీఫ్..?

ఈ పరిస్థితుల్లో 2024లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయం రెండు పార్టీల నేతల్లోనూ వ్యక్తమౌతోంది. అందుకే- పొత్తుల వ్యవహారాన్ని పునఃసమీక్షించుకోవాలని జనసేన పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో జనసేనతో పొత్తులకు చంద్రబాబు ద్వారాలు తెరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీతో కలిసి పని చేయాలంటే.. జనసేన తన మిత్రపక్షం బీజేపీతో తెగదెంపులు చేసుకుంటుందా? అనేది చర్చనీయాంశమౌతోంది.

టీడీపీ-జనసేన పొత్తులపై బ్యానర్లు..

టీడీపీ-జనసేన పొత్తులపై బ్యానర్లు..

ఈ పరిస్థితుల మధ్య సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో ఒకట్రెండు ప్రాంతాల్లో వెలిసిన బ్యానర్లు ఆసక్తిని రేపుతున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వంటి చోట్ల ఈ బ్యానర్లు కనిపించాయి. తెలుగుదేశం పార్టీ అభిమానులు రూపొందించిన బ్యానర్లలో పవన్ కల్యాణ్ ఫొటోలను ముద్రించడం ఆసక్తి రేపుతోంది. తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తు ఖాయమేననే విషయాన్ని ఈ బ్యానర్లు లీక్ చేసినట్టయింది.

బీజేపీ ఎలా స్పందిస్తుందో..

బీజేపీ ఎలా స్పందిస్తుందో..

ఈ బ్యానర్ల వ్యవహారంపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది. నిజానికి- చంద్రబాబు చేసిన లవ్ ట్రాక్ కామెంట్లను బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుపట్టారు. ఆయన ఎవరిపైనా ప్రేమించగలడంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య 2014లోనే ప్రేమ చిగురించిందంటూ అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాజాగా వెలిసిన ఈ బ్యానర్లపై సోము వీర్రాజు గానీ..ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు గానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+