వైసీపీ మాజీ ఎంపీకి బెయిల్, అయితే హత్య కేసులో ఊహించని ట్విస్ట్

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ వైసీపీ నందిగం సురేష్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కొంతకాలంగా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఇప్పుడు బెయిల్ వచ్చినా మరో కేసులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక హత్య కేసులో తుళ్లూరు పోలీసులు వేసిన పీటీ వారెంట్ ను విచారించడానికి ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఏం చెయ్యాలో తెలీక ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల అరెస్టు చేస్తారనే భయంతో నందిగం సురేష్ ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. నందిగం సురేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ కొటేసింది.

Bapatla YCP former MP Nandigam Suresh granted conditional bail

ముందస్తు బెయిల్ రాకపోవడంతో గత నెలలో నందిగం సురేష్ మాయం అయ్యారు. నందిగం సురేష్ ను అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే నందిగం సురేష్ చిక్కక పోవడంతో ఆయన కోసం పోలీసులు గాలించారు. హైదరాబాదులో రహస్య ప్రాంతంలో తలదాచుకున్న నందిగం సురేష్ ను గత నెలలో పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జిల్లాకు తరలించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆ తర్వాత పోలీసులు నందిగం సురేష్ ను గుంటూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కోర్టు అనుమతి తీసుకున్న పోలీసులు నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకుని విచారించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరచడంతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది.

ఇదే కేసులో వైసీపీ నాయకులు అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాంతో పాటు అనేక మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే అప్పిరెడ్డి తలశిల రఘురాం, దేవినేని అవినాష్. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ వచ్చినా మరో హత్య కేసులో ఇబ్బందులు ఎదురైనాయి. 2020లో గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని వెలగపూడిలో జరిగిన రాళ్ల దాడిలో మరియమ్మ అనే మహిళ చనిపోయింది. అప్పటి బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ రెచ్చగొట్టడం వలనే రాళ్ల దాడి జరిగిందని, ఈ దాడిలో మరియమ్మ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.

Bapatla YCP former MP Nandigam Suresh granted conditional bail

అప్పట్లో కేసు నమోదైనా అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ కేసు దర్యాప్తు మరుగునపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లడంతో మరియమ్మ కుటుంబ సభ్యులు మరోసారి తూళ్లూరు పోలీసులను కలిసిన మాకు న్యాయం చేయాలని, ఈ కేసు దర్యాప్తు చెయ్యాలని మనవి చేశారు.

ఇప్పుడు మరోసారి మరియమ్మ కేసు తెరమీదకు రావడంతో నందిగం సురేష్ కు ఇబ్బందులు ఎదురైనాయి. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం సురేష్ పై పోలీసులు పిటి వారెంట్ వేయడంతో ఆ పిటిషన్ విచారణ చెయ్యడానికి ట్రయల్ కోర్టు అనుమతించింది, ఈ కేసులో నందిగం సురేష్ కి బెయిల్ వస్తుందా, మరోసారి జైల్లోనే ఉండాల్సి వస్తుందా అని త్వరలోనే తెలుస్తుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+