జగన్‌ను ప్రజలు మడతపెట్టేశారు.. పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించటంతో మంత్రి సవిత సంతోషం వ్యక్తం చేశారు. పెనుకొండ మున్సిపాల్టీ సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అభివృద్ధికి పట్టం కడుతూ, కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని, చొక్కా మడతపెడతానని బెదిరించిన జగన్ ను మడత పెట్టి పక్కన పడేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పెనుకొండ మున్సిపాల్టీలో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లోనూ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు.

కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు జై కొట్టారన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలెండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయన్నారు. అందుకే ఇంత ఘన విజయం వరించింది అన్నారు. మున్పిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిపించారని మంత్రి సవిత తెలిపారు.
పెనుకొండ మున్సిపాల్టీలో 23 వార్డులతో పాటు చైర్మన్ అభ్యర్థిని ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వం గెలుచుకుందని మంత్రి సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. పెనుకొండ ప్రజల ఆదరాభిమానాలతో క్లీన్ స్వీప్ చేశామన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఎన్నికల మాదిరిగా క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు మంత్రి ధీమా వ్యక్తంచేశారు.
పెనుకొండ నియోజక వర్గ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ది చేపట్టామని, ప్రజలు అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తూ... పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన చైర్మన్ అభ్యర్థి త్రివేంద్రమూర్తి, వార్డు కౌన్సిలర్లతో ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి సవిత పెనుకొండ పట్టణంలో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ అభ్యర్థి త్రివేంద్రమూర్తిని, వార్డు కౌన్సిలర్లను అభినందిస్తూ మంత్రి సవిత సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications
