వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు: జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వెనుక..!

రెండు రోజుల క్రితం చంద్రబాబుపై అతనేం మహాత్ముడేం కాదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. లూజ్‌టాక్‌తో వారికే మంచిది కాదని హెచ్చరించారు. జేసీ ఆ తర్వాత అనలేదని చెప్పడం వేరే విషయం

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితం చంద్రబాబుపై అతనేం మహాత్ముడేం కాదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. లూజ్‌టాక్‌తో వారికే మంచిది కాదని హెచ్చరించారు. జేసీ ఆ తర్వాత అనలేదని చెప్పడం వేరే విషయం.

మళ్లీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య, చంద్రబాబుపై యూటర్న్, జగన్‌పై సెటైర్మళ్లీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య, చంద్రబాబుపై యూటర్న్, జగన్‌పై సెటైర్

జేసీ వ్యాఖ్యలు, చంద్రబాబు తీవ్ర స్పందన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు తీవ్ర స్పందన అనంతరం.. జేసీ తెలంగాణ అసెంబ్లీలో అదే అధినేత పైన ప్రశంసలు కురిపించారు.

టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన జేసీ అక్కడ కలిసిన వారికి చంద్రబాబు శోత్రం వినిపించారు. బాబు సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని పొగిడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తప్పు చేయడం చూడలేదన్నారు.

Behind JC Diwakar Reddy comments on CM Chandrababu Naidu!

అనంతపురం జిల్లాలో జేసీ సోదరులు వ్యవహర శైలీ ఎప్పుడు వివాదాస్పదమే. ఏ పార్టీలో ఉన్న వారి పనులు చేయించుకోవడం కోసం జేసీ బ్రదర్స్ స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్ భేటీలో హంగామా సృష్టించి సందర్భాలున్నాయి.

పనులు చేయించుకునేందుకు జేసీ ఇలా చేస్తారని టిడిపి నేతలు గుసగుసలాడుకుంటున్నారట. పనుల కోసమే టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారనే విమర్శలు టీడీపీ వర్గాల నుంచి వస్తున్నాయని అంటున్నారు. అనంతపురంలో రోడ్ల విస్తరణ చిక్కుముడిగా పడి విషయం తెలిసిందే. ఈ కారణంగానే చంద్రబాబు వల్లే అధికారంలోకి రాలేదని, మహాత్ముడేం కాదని వ్యాఖ్యానించారా అనే చర్చ సాగుతోంది.

English summary
Behind JC Diwakar Reddy comments on CM Chandrababu Naidu!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X