ఒక సక్సెస్, ఒక ఫెయిల్: నెహ్రూ చేరిక వెనుక, రోజా తగ్గకపోవడానికి కారణాలెన్నో!

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలను చేర్చుకోవాలన్న తెలుగుదేశం పార్టీ ప్రయత్నం సగమే సఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. జనాల్లో ఇమేజ్ ఉన్న రోజాను, కాపు కీలక నేత జ్యోతుల నెహ్రూ కోసం టిడిపి చాలా రోజులుగా గాలం వేస్తోంది.

అయితే, టిడిపి గాలానికి ఒక్క జ్యోతుల నెహ్రూ మాత్రమే చిక్కారనే వాదనలు వినిపిస్తున్నాయి. రోజా సినిమా స్టార్. ఆమెకు జనాల్లో క్రేజ్ ఉంది. అంతేకాదు, గతంలో ఆమె తెలుగుదేశం పార్టీలో పని చేశారు కూడా. అదే సమయంలో జ్యోతుల క్లీన్ ఇమేజ్ ఉన్న, పేరున్న కాపు నేత.

కీలక నేతలు అయిన రోజా, జ్యోతుల నెహ్రూను టిడిపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు బాగా ప్రయత్నాలు చేశారని, కానీ ఒక్క జ్యోతుల మాత్రం చేరేందుకు సిద్ధమయ్యారు. రోజా మాత్రం వైసిపిని వదిలి వచ్చేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

జ్యోతుల నెహ్రూ మొదటి నుంచి పీఏసీ చైర్మన్ పదవి పైన ఆశ పెట్టుకున్నారు. భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడంతో అది తనకే వస్తుందని భావించారు. కానీ దానిని కొత్తగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి జగన్ కట్టబెట్టారు. దీంతో నెహ్రూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

అదే సమయంలో, హోంమంత్రి చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతుల టిడిపిలోనే ఉంటే తనకు హోంమంత్రి పదవి దక్కకపోయేదని, నా ఈ పదవికి ఆయన వైసిపిలోకి వెళ్లడమే కారణమన్నారు. చినరాజప్ప కూడా కాపు నేత కావడం గమనార్హం.

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

తద్వారా పరోక్షంగా జ్యోతుల నెహ్రూకు తెలుగుదేశం పార్టీ ఉప ముఖ్యమంత్రి పదవి కాకపోయినా... దాని ద్వారా పదవిని ఎర వేసి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ్యోతుల టిడిపిలో చేరాక కీలకమైన పదవే లభిస్తుందని చినరాజప్ప వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని అంటున్నారు.

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

ఇక, రోజా రాకపోవడానికి కూడా కారణాలు లేకపోలేదని అంటున్నారు. టిడిపిలో పొసగక పోవడం వల్లనే వెళ్లిన రోజాకు.. జగన్ చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని, అలాంటి ప్రాధాన్యత టిడిపిలోకి వస్తే ఉండదని ఆమె భావిస్తోందని అంటున్నారు. ఆమె రాకపోవడం వెనుక ఆ కారణం కూడా కావొచ్చని చెబుతున్నారు.

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

ఇప్పటికే ఎనిమిది మంది వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు తదితరులు త్వరలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వారి పైన జగన్ ప్రతివ్యూహానికి సిద్ధమయ్యారు.

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

జ్యోతుల రావడం వెనుక, రోజా నో వెనుక..!

తమ పార్టీ నుంచి గెలిచి సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో వారిని ఎండగట్టాలని జగన్ భావిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో భారీ సభలను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ధర్నాలు, నిరసన కార్యక్రమ యోచన కూడా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+