షాకింగ్: కంటతడి పెట్టారు.. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇదీ!!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం ఏపీలో టిడిపి, వైసిపి, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మోడీతో జగన్ భేటీ రహస్యం ఇది అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనం ఇచ్చింది.

మోడీతో జగన్ రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారని, ఆ భేటీ ఏమిటో చెప్పాలని టిడిపి నేతలు ప్రశ్నించారు. అయితే, ప్రధానితో జగన్ భేటీ అయితే తప్పేమిటని బీజేపీ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ మగాడిలా మీడియా ఎదుటే మోడీని కలిశారని, ఎందుకు కలిశానో కూడా చెప్పారని వైసిపి నేతలు చెబుతున్నారు.

బాబుకు షాక్!: భారతికి ఆరేళ్ల తర్వాత.. జగన్ ఈడీ లేఖపై కదిలిన మోడీ?

ఏపీ సమస్యల పరిష్కారం కోసమే ప్రధానిని కలిశానని, ఒకటి రెండు అంశాల్లో తప్ప బీజేపీకి, తమ పార్టీకి మధ్య విభేదాలు ఏమీ లేవని జగన్ విలేకరులతోనూ చెప్పారు. మిర్చి రైతులకు మద్దతు ధర పెంచాలని, ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించమని, అగ్రిగోల్డ్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చూడాలని.. ఇలా సమస్యలను ప్రధానికి నివేదించినట్టు చెప్పారు.

బయట చెప్పింది ఒకటి, లోపల జరిగింది మరొకటి అంటూ..

బయట చెప్పింది ఒకటి, లోపల జరిగింది మరొకటి అంటూ..

అయితే, జగన్ బయట చెప్పింది ఒకటి, లోపల విజ్ఞప్తి చేసింది మరొకటి అంటూ తాజాగా కథనం ఇచ్చారు. తన మీద కేసులపై మొర పెట్టుకున్నారని, ఈడీ తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారని, తాను, తన కుటుంబ సభ్యులు కష్టాలు పడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారని తన కథనంలో పేర్కొంది.

ఇద్దరు ఐటీ అధికారుల పేర్లతో ఫిర్యాదు చేశారని, వారు టిడిపితో కుమ్మక్కయినట్లు ఆరోపణలు చేశారని, వారి బారి నుంచి కాపాడాలని పేర్కొన్నారని, ప్రధానికి ఏడు పేజీల వినతిపత్రం ఇచ్చారని, తమ చేతిలో ప్రతులు వచ్చాయని పేర్కొంది.

ఏడు పేజీల వినతిపత్రం

ఏడు పేజీల వినతిపత్రం

ప్రధానిని కలిసిన జగన్ ఏపీ సమస్యల గురించి కాకుండా తన సమస్యల పరిష్కారం కోసమే కలిశారని, ఈడీ తనను వేధిస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేస్తూ ఏడు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారని, టిడిపి మాయలో పడిన ఈడీ అధికారులు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని జగన్ వాపోయారని పేర్కొంది. తనను కాపాడాలని కోరారు.

ఈడీ అధికారులపై ఫిర్యాదు

ఈడీ అధికారులపై ఫిర్యాదు

ఈ మేరకు జగన్ హైదరాబాద్ ఈడీ జోన్‌లో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ గాంధీల పేర్లను ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించారని, వారిద్దరూ టిడిపితో కుమ్మక్కై తనను ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు చేశారని పేర్కొంది.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై తనపై సీబీఐ, ఈడీలతో కేసులు పెట్టించారని జగన్ పేర్కొన్నారని తెలిపింది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఫిర్యాదు చేశారని, ముఖ్యమంత్రిగా ఈ మూడేళ్లలో చంద్రబాబు రూ.1.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని పేర్కొంది. మరో విషయమేంంటే జగన్ ప్రధానిని యువర్ ఎక్సలెన్సీ అని సంబోధిస్తూ గోడు వెల్లబోసుకున్నారని పేర్కొంది.

కాగా, ప్రస్తుతం బయటపడిన జగన్ వినతిపత్రం ఏపీలో దుమారం రేపుతోంది. జగన్‌పై ఎదురుదాడికి ఇది తెలుగుదేశం పార్టీకి పాశుపతాస్త్రంలా ఉపయోగపడిందంటున్నారు.

వినతిపత్రంలోని అంశాలు ఇవేనంటూ...

వినతిపత్రంలోని అంశాలు ఇవేనంటూ...

'మాపై వచ్చిన అభియోగాలకు సంబంధించి నమోదు చేసిన కేసు (ఈసీఐఆర్‌/09/హెచ్‌జెడ్‌వో/2011) విచారణలో ఈడీ అధికారులు బీఎస్‌ గాంధీ, ఎస్‌ఏ ఉమాశంకర్‌గౌడ్‌ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టిడిపి పెద్దలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి టీడీపీ వీరిని పావులుగా వాడుకుంటోంది. ఆ వ్యక్తులు నా పట్ల అసూయతో వ్యవహరిస్తున్నారు.
చట్టంతో సంబంధం లేకుండా, చట్టం అనుమతించని అధికారాలను చెలాయిస్తున్నారు. వారు వ్యక్తిగత దురుద్దేశాలతో చట్టంతో సంబంధం లేకుండానే నన్ను తీవ్ర వేధింపులకు గురిచేస్తూ జీవనోపాధికి సంబంధించిన వనరులను పొందకుండా ప్రతీకారేచ్ఛతో వ్యవహరిస్తున్నారు. ఒక ఉద్యోగి చట్టపరిధిలోనే తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. వాటిని అతిక్రమించరాదు. రాజకీయ ఉద్దేశాలకోసం వాటిని దుర్వినియోగం చేయకూడదు.

అయితే, ఆ ఇద్దరూ ఉద్యోగ ధర్మానికి విరుద్ధంగా అధికారం ముసుగులో అన్ని రకాల చట్ట వ్యతిరేక చర్యలకు దిగారు.రాజ్యాంగ, చట్టపరిధిలోనే ఈడీ పని చేయాలి. అయితే వారి చర్యలు ఈ పరిమితిని అతిక్రమించాయి. స్వతంత్ర సంస్థ పనితీరును ప్రశ్నించేలా, రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లుగా వారి చ ర్యలు ఉన్నాయి.ఓసీ నం. 618/2016లో 2016, నవంబరు 23న ప్రొవిజనల్‌ అటాచ్‌మెంట్‌ ఇచ్చారు. మనీల్యాండరింగ్‌ చట్టం కింద ఈ ఉత్తర్వుపై అప్పీల్‌ చేసుకునే హక్కు నాకుంది.

జఫ్తు ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు..

జఫ్తు ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు..

అయితే అప్పీల్‌ హక్కును కాలరాస్తూ జప్తు చేసిన ఆస్తులను స్వాధీన పర్చుకునేందుకు బీఎస్‌ గాంధీ ప్రయత్నించారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించారు. ఎఫ్‌డీల విషయంలో కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా చేశారు. జప్తు చేసిన ఆస్తులను అమ్మేయాలని ప్రతిపాదించారు. చివరకు హైకోర్టుకు వెళ్లి స్టేటస్‌ కో తెచ్చుకున్నా. టీడీపీకి ప్రయోజనాలు కల్పించి ప్రజల్లో, రాజకీయంగా నన్ను తక్కువ చేసేందుకు ప్రయత్నించారు.

అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు చట్టాలను అమలు చేసే అధికారులను వాడుకోవడం దురదృష్టకరం. యూపీఏ హయాంలో రాజకీయ ప్రయోజనాలకోసమే సీబీఐతో మాపై కేసులు పెట్టించారు. కేసులు నమోదైన ఆరేళ్ల తర్వాత ఈడీ మరో అడుగు ముందుకేసింది.

ఆరోపణలు లేని నా భార్యపై..

ఆరోపణలు లేని నా భార్యపై..

ఎలాంటి ఆరోపణలు, అభియోగాలు లేని నా భార్యను ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తూ సమన్లు జారీ చేసింది. కేసు విచారణ పూర్తిచేసిన తర్వాత ఆస్తులను జప్తు చేస్తూ ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. టీడీపీ రాజకీయ ఎజెండాలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. మార్చి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని షెడ్యూలు ప్రకటించిన తర్వాత ప్రజల్లో నా పార్టీని చులకన చేసేందుకు, టీడీపీకి మేలు చేసేందుకు ఈ సమన్లను తెరమీదకు తీసుకొచ్చారు.

టిడిపికి మేలు చేసేందుకు కేసు విచారణలో ప్రతీ చట్టాన్ని, నియమ నిబంధనలను ఈడీ ఉల్లంఘించింది. ఈ మేరకు టీడీపీ ఆ అధికారులను కాపాడుతోంది. వారి పోస్టింగ్‌ కాలం ముగిసినా బదిలీ చేయకుండా అడ్డుకుంటోంది. దీంతో వారు టీడీపీనుంచి ఆదేశాలు తీసుకుని మాపై అమలు చేస్తున్నారు.

కాబట్టి హైదరాబాద్‌లో ఈడీచేసే ప్రతి చర్యా ఏపీ సీఎంవో(ముఖ్యమంత్రి కార్యాలయం) నుంచి వచ్చే ఆదేశాలను బట్టే ఉంటోంది.ప్రతీకారేచ్ఛతో కూడిన ఇద్దరు అధికారుల చట్టవ్యతిరేక చర్యలపై మేం న్యాయపరమైన పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరు కూడా దృష్టిపెట్టి విషయాన్ని పరిశీలించాలి.' అని జగన్ విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నట్లు పత్రిక పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One leading News Paper revealed Why YSR Congress Party chief YS Jaganmohan Reddy met PM Narendra Modi.
Please Wait while comments are loading...