మాకే లాభం: పవన్, లగడపాటిలపై వాసిరెడ్డి, టిపై జైరాం

Benefit to YSRCP: Vasireddy
హైదరాబాద్: లగడపాటి రాజగోపాల్, పవన్ కళ్యాణ్‌ల వల్ల తమ పార్టీకే లాభమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధఇ వాసిరెడ్డి పద్మ ఆదివారం అన్నారు. టిడిపికి పవన్ ప్రచారం చేయడం, టిడిపి గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే బిసిలకు, కాపులకు ఒక్కో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన టిడిపి అధ్యక్షులు నారా చంద్రనాయుడు పైన మండిపడ్డారు. బిసిలు, కాపుల పైన చంద్రబాబు అంత ప్రేమ ఎందుకు పుట్టిందన్నారు అధికారం కోసమే కాపులకు, బిసిలకు ఉప ముఖ్యమంత్రి పదవి అంటున్నారన్నారు.

జిల్లాకో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. డిప్యూటీ సిఎం అంశం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదని ప్రశఅనించారు.

తలరాత మార్చే ఎన్నిక: జగన్

ఈ ఎన్నికలు సీమాంధ్ర ప్రజల తలరాతను మార్చేవని జగన్ వేరుగా అన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి నేత కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఓట్ల, సీట్ల కోసం కాంగ్రెసు దారుణాలకు ఒడిగట్టింద్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని, గూడులేని అక్కా చెల్లెల్లకు ఇళ్లు కట్టిస్తామని, ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు చేస్తామని, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తామని జగన్ అన్నారు.

సీమాంధ్రను ఫణంగా పెట్టాలనుకోలేదు: జైరాం

సీమాంధ్ర ప్రాంతాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ ఇవ్వాలని తాము భావించలేదని కేంద్రమంత్రి జైరాం రమేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అన్నారు. విభజన నేపథ్యంలో ఇప్పటి ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణా వాటర్ బోర్డు కేంద్రం ఏర్పాటు చేస్తుందన్నారు. సీమాంధ్రలో జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+