• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో బెంగాల్ త‌ర‌హా ర్యాలీ..! హాజ‌ర‌వ్వాల్సిందిగా కేసీఆర్ కు చంద్రబాబు బ‌హిరంగ లేఖాస్త్రం..!!

|

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఏపీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది పార్టీలు ఎత్తుల పైఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏ పార్టీ ఏ ప్ర‌ణాళిక ర‌చించినా లక్ష్యం మాత్రం ఒక్క‌టే..! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల‌ని. అందుకోసం అదికార టీడిపి పార్టీనుండి మొద‌లు కొని ఏపీలోని అన్ని పార్టీలు ప‌క్కాగా త‌మ వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు రెఢీ ఐపోతున్నాయి. ఇక ఏపి సియం చంద్ర‌బాబు నాయుడు ఇదే అంశంలో వినూత్నంగా త‌ర‌హాలో రాజ‌కీయ పార్టీల‌ను టార్గెట్ చేయ‌బోతున్నారు.

 ఏపిలో కేంద్రానికి వ్య‌తిరేకంగా ర్యాలి..! పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు బాబు లేఖ‌..!!

ఏపిలో కేంద్రానికి వ్య‌తిరేకంగా ర్యాలి..! పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు బాబు లేఖ‌..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తన సుధీర్గ రాజ‌కీయ జీవితంలో ఎన్నో రాజ‌కీయ ములుపుల‌ను చూసి ఉండి ఉంటారు. కానీ, రాజకీయాలు చేయడంలో ఆయనను మించిన వారు లేరనే చ‌ర్చ కూడా జ‌రుగుతుంటుంది. అందుకే చంద్రబాబును రాజకీయాల్లో అపర చాణక్యుడిగా సంభోదిస్తుంటారు. ఇంత వ్యూహాత్మ‌కంగా ఉండే చంద్రబాబును ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు బాగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే వీటన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టేందుకు ఆయన మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మోదీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలే ల‌క్ష్యం..! ఏపి ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్ప‌డ‌మే బాబు ద్యేయం..!!

మోదీ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలే ల‌క్ష్యం..! ఏపి ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్ప‌డ‌మే బాబు ద్యేయం..!!

రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అదిరిపోయే సమాధానం చెప్పేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించిన ఆయన.. నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరికీ చెక్ పెట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే అమరావతి ర్యాలీ. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ‘యునైటెడ్ ఇండియా' పేరిట నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ఆంధ్రప్రదేశ్ ఓ బ్రుహ‌త్క‌ర ర్యాలీ నిర్వ‌హించాల‌ని బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 స్పీడు పెంచిన బాబు..! జాతీయ నేత‌ల‌తో మంత‌నాలు షురూ..!!

స్పీడు పెంచిన బాబు..! జాతీయ నేత‌ల‌తో మంత‌నాలు షురూ..!!

ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ ‘యునైటెడ్ ఇండియా' ర్యాలీని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను కోల్‌కతా సభలోనే చేసిన చంద్రబాబు, తాజాగా ఈ సభకు సంబంధించిన పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సభకు 22 పార్టీల నేతలు వస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు ముగిశాయని తెలుస్తోంది. ఈ ర్యాలీతో ఇద్దరు రాజ‌కీయ నేత‌లు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొన‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీకి కేసీఆర్‌కు ఆహ్వానం ఉన్నా, ఆయ‌న గానీ, ఆ పార్టీ తరపున ఎవరూ దీనికి హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగానే ర్యాలీకి రాలేకపోయామని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, అమరావతిలో జరిగే ర్యాలీకి కూడా కేసీఆర్‌ను ఆహ్వానించబోతున్నారట చంద్రబాబు.

 మోదీకి, కేసీఆర్ కి చెక్..! ర్యాలీలో ఏంచెప్తార‌నే దానిపై ఉత్కంఠ‌..!!

మోదీకి, కేసీఆర్ కి చెక్..! ర్యాలీలో ఏంచెప్తార‌నే దానిపై ఉత్కంఠ‌..!!

ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మీరు బీజేపీ వ్యతిరేకులైతే ఈ ర్యాలీకి కచ్చితంగా రావాలని, లేదంటే టీఆర్ఎస్ స్టాండ్ ఏంటో స్ప‌ష్ట‌మైపోతుంద‌ని లేఖ‌లో కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. బహిరంగా లేఖ కావడంతో టీఆర్ఎస్ అధినేత కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ ర్యాలీకి ఎలాగో తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కారు కాబట్టి దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఏపీ సీఎం భావిస్తున్నట్లు స‌మాచారం. ఇదే జరిగితే ర్యాలీతో మోదీకి, లేఖతో కేసీఆర్‌కు చెక్ పెట్టినట్లవుతుందని అమ‌రావ‌తిలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
The 'United India' rally is going to be held in Amravati, the capital of Andhra Pradesh.Chandra Babu's open letter to KCR to attend the rally. If you are anti-BJP, you will have to come up with a letter, in the letter saying that the rally should come to clear or the TRS stand is clear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X