రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు యువతి కిడ్నాప్: ఛేదించిన సికింద్రాబాద్ పోలీసులు
హైదరాబాద్: బెంగళూరులో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో కిడ్నాప్‌కు గురైన యువతిని సికింద్రాబాద్ రైల్వే పోలీసు కాపాడారు. బెంగళూరుకు చెందిన ఓ యువతిని గురువారం రాత్రి కిడ్నాప్ చేసి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకువెళ్ళుతున్నారని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బెంగళూరు నుంచి సమాచారం అందింది.
దీంతో అప్రమత్తమైన నగర పోలీసులు ట్రైన్ ఎస్కార్ట్‌ను అలర్ట్ చేసి రైలు సికింద్రాబాద్‌కు చేరుకునే సమయంలో హెచ్1 ఏసీ బోగీ నుంచి యువతిని రక్షించారు. కిడ్నాపర్ నిజాంను అరెస్టు చేశారు. కేసును రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

కడప: జిల్లాలోని రాజంపేట మండలం బోయిన్‌పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మతి చెందారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తిరుపతి నుంచి వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.
ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications