గిన్నిస్ స్పీడ్ తో బెంగళూరు - విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే. ఇక రయ్ రయ్
బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని వానవోలు - వంకరకుంట ప్రాంతంలో జరుగుతున్న ఈ రహదారి నిర్మాణం అసాధారణ వేగంతో కొనసాగుతోంది. ప్రపంచానికి భారత రహదారి నిర్మాణ సామర్థ్యాన్ని చాటేలా ఒకేసారి నాలుగు గిన్నిస్ రికార్డులు సాధించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు పూజలతో ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.
జాతీయ రహదారి 544జీ ( NH-554G) పై ప్యాకేజీ-2 కింద ఈ పనులను చేపట్టినట్లు నిర్మాణ సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రా కాన్ తెలిపింది. సంస్థ సీఎండీ జగదీశ్ కదం, ఎన్‌హెచ్‌ఏఐ(NHAI) ప్రాంతీయ అధికారి ఆర్‌కే సింగ్‌లతో కలిసి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రికార్డు లక్ష్య పనుల్లో 600 మందికిపైగా కార్మికులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
అత్యంత పొడవైన రోడ్డు..
ఈ నెల 5 నుంచి 12 తేదీల మధ్య ఏడు రోజుల పాటు నిరంతరంగా 52 కిలోమీటర్ల మేర బిట్యుమినస్ రోడ్డును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో అత్యధిక నిర్మాణ సామగ్రి వినియోగం, 24 గంటల్లో అత్యంత పొడవైన రోడ్డు నిర్మాణం, అలాగే ఒకే రోజులో అత్యధిక బిట్యుమినస్ కాంక్రీట్ వినియోగం వంటి నాలుగు విభాగాల్లో గిన్నిస్ రికార్డులు సాధించాలని భావిస్తున్నారు.

రికార్డుల చరిత్ర కొత్తేమీ కాదు..
రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్‌కు రికార్డుల చరిత్ర కొత్తేమీ కాదు. గతంలో 24 గంటల్లో దాదాపు 40 కిలోమీటర్ల బిట్యుమినస్ రోడ్డును నిర్మించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అలాగే జాతీయ రహదారి 53పై 75 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్డు నిర్మాణంలో గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. 2022లో మహారాష్ట్రలో అమరావతి నుంచి అకోలా వరకు రెండు లేన్ల రహదారిని కేవలం 105 గంటలలో పూర్తి చేసి మరో ఘనత సాధించింది. గత విజయాలే తమకు ప్రేరణగా మారాయని, సత్యసాయిబాబా ఆశీస్సులతో కొత్త రికార్డులు సృష్టిస్తామని సంస్థ జీఎం పురుషోత్తం ధీమా వ్యక్తం చేశారు.
దీనినే అస్ఫాల్ట్ రోడ్డు..
ఈ రహదారిలో ఉపయోగిస్తున్న బిట్యుమినస్ విధానం ప్రత్యేకత కలిగినది. ముడి చమురు నుంచి లభించే బిట్యుమిన్‌ను క్రష్ చేసిన రాయి, ఇసుక, కంకరతో కలిపి రోడ్డు ఉపరితలం రూపొందిస్తారు. దీనినే అస్ఫాల్ట్ రోడ్డు అని కూడా పిలుస్తారు. దీని వల్ల రోడ్డు బలంగా ఉండటమే కాకుండా నీరు చొరబడని లక్షణాన్ని కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తయ్యే ఈ రోడ్లు దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారత రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపనుందని నిపుణులు చెబుతున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications