కడపలో టెన్షన్.. టెన్షన్ : ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి ఫైట్
కడప : కొత్తగా టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఏళ్లుగా ఇద్దరి మధ్య కొనసాగుతోన్న వైరం.. ఇద్దరు ఒకే గూటి నేతలయ్యాక మరింత ముదురుతోంది. తాజాగా నీరు-చెట్టు కార్యక్రమంలో ఇరు నేతల వర్గీయులు బాహాబాహికి దిగడంతో జమ్మలమడుగులో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది.
కొండాపురం మండలం కొత్తపల్లెలో చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి తెరలేపింది. నిధుల విషయంలో తలెత్తిన గొడవ కాస్త.. పెద్దదిగా మారడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి.ఎమ్మెల్యే ఆది అనుచరులు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అనుచరుల మీద దాడికి దిగడంతో.. మంత్రి వర్గీయులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

ఫిర్యాదు చేసి రామసుబ్బారెడ్డి వర్గీయులు వెనక్కి తిరుగుతున్న సందర్బంలో.. ఆది వర్గీయులు ఎదురుపడడంతో మరోసారి రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాగ్వాదం కాస్త.. దాడులకు దారి తీయడంతో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నట్లు సమాచారం. దీంతో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన 10మంది అనుచరులకు గాయాలవగా.. వారందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం లాఠీ చార్జ్ ద్వారా రెండు వర్గాలను పోలీసులు అదుపు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications