లక్షకు రూ.3.50 లక్షల లాభం.. ఏడాదిలోనే అదిరిపోయే రిటర్న్స్..
భారత్ మారుతీ లిమిటెడ్ (Bharat Maruti Limited) కంపెనీకి చెందిన షేరును వాచ్ లిస్టులో చేర్చుకోవాలని షేర్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 1983లో ఏర్పాటైన ఈ కంపెనీ ఆటోమోటివ్ కంపోనెంట్స్, ప్యాసెంజర్ కార్ల అసెంబ్లింగ్ పార్ట్స్ తయారు చేస్తుంటుంది. మారుతీ సుజుకీ ఇండియా భాగస్వామ్యంతో ఎగ్జాస్ట్ సిస్టమ్స్, ఫ్యూయల్ ఫిల్లర్స్, సస్పెన్స్ పార్ట్స్‌లో పేరు తెచ్చుకుంది.
ఈ కంపెనీకి చెందిన పరిశ్రమలు గురగావూన్, బవాల్, మనేసర్ (హర్యానా), గుజరాత్‌లో ఉన్నాయి. మారుతీ సుజుకీ అవసరాలను తీర్చేందుకు హరియాణా, గుజరాత్‌లో రెండు కొత్త ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఖర్ఖొడా, సొనిపత్, ఎస్ఎంజీ సప్లయర్ పార్క్ లో ఏర్పాటు చేయబోతున్నారు. రూ.300 నుంచి రూ.350 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతోంది.

సంవత్సరం వ్యవధిలోనే ఈ మల్టీబ్యాగర్ షేరు 81.6 శాతం పెరిగింది. మూడు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు 144 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఈ మూడేళ్లలో 12 శాతంగా సెల్స్ గ్రోత్ నమోదైంది. కంపెనీ లాభం 8 శాతం పెరగ్గా డివిడెండ్ ఈల్డ్ 0.58 శాతం పెరిగింది. భారత్ మారుతీ లిమిటెడ్ షేర్లలో మూడు సంవత్సరాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ షేర్ల విలువ రూ.2.44 లక్షలైంది. సంవత్సరం క్రితం రూ.1 పెట్టినట్లయితే ఇప్పుడు రూ.1.81 లక్షలుగా ఉంటుంది. జూన్ 14 వ తేదీన జరిగిన ట్రేడింగ్ లో భారత్త మారుతీ కంపెనీ షేరు 10.43 శాతం పెరిగింది. కొత్తగా 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.233.70ని తాకడంతోపాటు అదనంగా షేర్ల వాల్యూమ్ 1.01 టైమ్స్ పెరిగింది. ఈ కంపెనీ షేర్లను తమ వాచ్ లిస్ట్‌లో చేర్చుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications