వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమ్లా నాయక్: పవన్ కళ్యాణ్ పై దాడి కాదు; థియేటర్లపై జరుగుతున్న దాడి: ఎన్.వి. ప్రసాద్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా థియేటర్లలో నిబంధనల పేరుతో భీమ్లా నాయక్ ప్రదర్శన కాకుండా అడ్డుకుంటున్నారని ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంటర్నెట్ లో అనేక వీడియోలను వైరల్ చేస్తున్నారు. చాలా సినిమా థియేటర్ల దగ్గర పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నట్టుగా కనిపిస్తున్న వీడియోలను పెట్టి నెటిజన్లు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఏపీలో భీమ్లా నాయక్ సినిమా కష్టాలు: మైలవరం,ఇంకొల్లులో థియేటర్ల మూసివేత; నిరాశలో పవన్ ఫ్యాన్స్ఏపీలో భీమ్లా నాయక్ సినిమా కష్టాలు: మైలవరం,ఇంకొల్లులో థియేటర్ల మూసివేత; నిరాశలో పవన్ ఫ్యాన్స్

Read more at:

జగన్ సర్కార్ తీరుపై మండిపడిన ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్. వి. ప్రసాద్

జగన్ సర్కార్ తీరుపై మండిపడిన ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్. వి. ప్రసాద్


పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా చూడాలని ఎంతో ఆశలు పెట్టుకున్న అభిమానులు జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో బెనిఫిట్ షోలు లేకుండా చేయడంపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్ వి ప్రసాద్ కూడా జగన్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న దాడి పవన్ కళ్యాణ్ పై కాదని, ఇది థియేటర్ల వ్యవస్థ పై జరుగుతున్న దాడి అని ఎన్. వి. ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఏపీ ప్రభుత్వం థియేటర్ల వ్యవస్థ మీద చేస్తున్న దాడి చాలా కలచివేస్తుంది

ఏపీ ప్రభుత్వం థియేటర్ల వ్యవస్థ మీద చేస్తున్న దాడి చాలా కలచివేస్తుంది

తాజాగా మీడియాతో మాట్లాడిన ఎన్.వి.ప్రసాద్ ఏపీ ప్రభుత్వం థియేటర్ల వ్యవస్థ మీద చేస్తున్న దాడి చాలా కలచివేస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు నుండి ఇక్కడికి ఎంతో కష్టపడి ఇండస్ట్రీని తీసుకువచ్చామని, ఇప్పుడు సినీ పరిశ్రమపై జరుగుతున్న దాడిని చూస్తే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని ఎన్. వి. ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అన్ని టాక్స్ లు కట్టించుకుని రెన్యువల్ చేయడం లేదని మండిపడ్డారు.

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళబోము

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళబోము

ఉదయం 10 గంటల లోపు ఎవరూ సినిమా వేయలేదని పేర్కొన్నారు. మమ్మల్ని దొంగల మాదిరిగా అనుమానిస్తూ థియేటర్ల వద్ద 15 మందిని కాపలా పెట్టి దాడులు చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన విషాదంలో ఉన్న సమయంలో థియేటర్ల వ్యవస్థపై దాడి అవసరమా అంటూ ప్రశ్నించారు. కరోనా కంటే ఈ దాడి తీవ్రమైన దాడి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళమని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడి కాదు, థియేటర్లపై జరుగుతున్న దాడి

పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడి కాదు, థియేటర్లపై జరుగుతున్న దాడి


ఇప్పటికే మంత్రి నానిని కలిసి మా బాధలు చెప్పుకున్నామని, ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని, ఇప్పుడు కాస్తోకూస్తో కరోనా మహమ్మారి నుండి రికవరీ అవుతుండగా ప్రభుత్వం ఈ విధంగా మళ్లీ దాడి చేస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం థియేటర్ల వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ఇది పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న దాడి కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎగ్జిబిటర్లు వ్యాపారం చేయలేరని, దీని బదులు మరేదైనా వ్యాపారం చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నారంటూ ఎన్. వి. ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వం తన స్టాండ్ ఏమిటో స్పష్టత ఇవ్వాలి

ప్రభుత్వం తన స్టాండ్ ఏమిటో స్పష్టత ఇవ్వాలి

ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎన్ .వి. ప్రసాద్ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి విజయవాడలో థియేటర్లు ఉన్నాయి అని పేర్కొన్న ఎన్.వి.ప్రసాద్ అక్కడి పరిస్థితిని సీఎం తెప్పించుకుని చూడవచ్చని సూచించారు. మా అసోసియేషన్ చాంబర్లో ఒక మెంబెర్ మాత్రమేనని పేర్కొన్నారు . ఫిలిం ఛాంబర్ సుప్రీమ్ అంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన స్టాండ్ ఏమిటో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్. వి. ప్రసాద్ పేర్కొన్నారు.

English summary
Former President of AP Film Chamber N.V. Prasad said it was not an attack on Pawan Kalyan but an attack on theaters. He said they would not go to court over this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X