భూదాన్ భూముల అక్రమాలపై సిఐడి విచారణ: బోర్డు రద్దు చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి భూదాన్ బోర్డు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, భూదాన్ భూముల అక్రమాలపై సిఐడి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భూదాన్ బోర్డుపై రెండు కేసులు నమోదయ్యాయి. కేసులన్నింటినీ సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సిఐడి విచారణతో భూముల అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. భూదాన్ బోర్డు పేరుతో భూముల అక్రమ కేటాయింపులు ఆరోపణలున్నాయి. కాగా, నాలుగు బృందాలుగా సిఐడి విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications