ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలోకి భూమా అఖిలప్రియ ? జగన్ పార్టీలో చేరాలని సలహా ఇస్తున్న వైసీపీ కీలక నేత !!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా ? ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్న భూమా అఖిలప్రియ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకువెళ్లడానికి ఆమె బంధువులు ప్రయత్నం చేస్తున్నారా ? తన భర్త భార్గవ్ రామ్ తో పాటుగా, తనపై అనేక కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ప్రత్యామ్నాయంగా భూమా అఖిలప్రియ భావిస్తున్నారా ? అంటే కర్నూలు జిల్లా నాయకులు కొందరు అవును అనే సమాధానం చెబుతున్నారు.

 అనేక కేసుల్లో చిక్కుకున్న భూమా అఖిల ప్రియ

అనేక కేసుల్లో చిక్కుకున్న భూమా అఖిల ప్రియ


మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తల్లిదండ్రుల మరణంతో చిన్న వయసులోనే ఊహించనివిధంగా పదవులు దక్కించుకున్నారు. మంత్రి పదవి దక్కించుకున్న ఆమెకు రావలసినంత పేరు రాకున్నా తెలుగుదేశం పార్టీ ఆమెకు మంత్రిగా సముచిత స్థానాన్ని ఇచ్చింది. అదలా ఉంచితే గత ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ చుట్టూ అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. అనేక కేసులు సైతం నమోదయ్యాయి. ఈ సమయంలో కూడా భూమా అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగానూ సహాయం చేయలేకపోయింది.

అఖిల ప్రియ బంధువులంతా వైఎస్సార్సీపీలోనే

అఖిల ప్రియ బంధువులంతా వైఎస్సార్సీపీలోనే

ఈ క్రమంలో ఒక్క భూమా అఖిలప్రియ తప్ప, మిగతా ఆమె బంధువులు అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండటంతో చాలా వరకు ఆమెను కూడా వైసీపీలో చేరాలని సలహా ఇస్తున్నట్లుగా సమాచారం. ఆమె సోదరుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే సొంత మామ కాటసాని రామిరెడ్డి వైసీపీ లోనే ఉన్నారు. సొంత మేనమామ ఎస్ వి మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండటంతో ఆమెకు వైసీపీలో చేరాలని సలహాలు ఇస్తున్నారని సమాచారం.

 కబ్జా కేసుల్లోనూ జైలుకు వెళ్ళొచ్చిన అఖిలప్రియ

కబ్జా కేసుల్లోనూ జైలుకు వెళ్ళొచ్చిన అఖిలప్రియ

ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంతో పాటుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా భూమా అఖిలప్రియ కుటుంబానికి సంబంధించిన బంధు గణమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ప్రస్తుతం టిడిపిలో భూమా అఖిలప్రియ ఒంటరి పోరాటం చేస్తుంది. ఇక ఇదే సమయంలో అఖిల ప్రియ కు జగన్ తల్లి విజయమ్మతో గతంలో మంచి అనుబంధమే ఉండేదని సమాచారం. ప్రస్తుతం అఖిలప్రియ పై, ఆమె భర్త భార్గవ్ రామ్ పై కేసులు నమోదు అయ్యాయి. కొంతకాలం భార్గవ్ రామ్ పరారైన విషయం కూడా తెలిసిందే. హైదరాబాద్లో కబ్జా కేసులో ఇరుక్కుని జైలు కూడా వెళ్లి వచ్చారు భూమా అఖిలప్రియ.

ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న అఖిలప్రియ

ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న అఖిలప్రియ

మరోవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా అఖిల ప్రియ ఫ్యామిలీని వెంటాడుతున్నాయి. అందుకే గత కొంత కాలం నుంచి భూమా అఖిలప్రియ రాష్ట్రంలో రాజకీయాల మీద సైలెంట్ గా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటే పరిస్థితి ముందు ముందు ఎంత దారుణంగా ఉంటుందో అన్న భయం కూడా అఖిల ప్రియను వెంటాడుతోంది. ఈ క్రమంలో అఖిల ప్రియ రాజకీయాల్లో పట్టు సడలకుండా ఉండటం కోసం, తన బంధువులు అందరి మద్దతు తనకు ఉండేలా చూసుకోవడం కోసం తిరిగి వైసీపీ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా స్థానికంగా చర్చ జరుగుతుంది.

అఖిల ప్రియ వైసీపీ బాట పడుతుందా ?

అఖిల ప్రియ వైసీపీ బాట పడుతుందా ?

అయితే రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు పట్ల ఉన్న విధేయత ఇంతకాలం అఖిలప్రియ పార్టీ మారకుండా ఆపింది. మరి ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో పుట్టెడు కష్టాల్లో ఉన్న అఖిలప్రియను చంద్రబాబు ఆదుకోగలడా ? లేదా తన మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి సలహా మేరకు భూమా అఖిలప్రియ వైసిపి బాట పడుతుందా అన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

Recommended Video

Priya Punia’s Father Inspired Her With Virat Kohli’s Example || Oneindia Telugu

English summary
With the exception of Bhuma Akhilapriya, all her other relatives are in the YSR Congress party and most are reportedly advising her to join the YCP. Her brother Nandyala former MLA Brahmanandareddy, Banaganapalle MLA Katsani Ramireddy and own uncle SV Mohan Reddy are all reportedly advising her to join the YCP to relief from some problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X