ఆ ఒత్తిడే నా తండ్రి మృతికి కారణం, పీక్కు తినేందుకు ఏకమయ్యారు: భూమా అఖిలప్రియ

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: దుష్ట శక్తుల ఒత్తిడే తన తండ్రి భూమా నాగిరెడ్డి మృతికి కారణం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డలో జరిగిన నాగిరెడ్డి వర్ధంతి సభలో ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే.

బాబు వల్లే కియా వచ్చిందని గొప్పలు, భయపడ్డారు: మాణిక్యాల రావు తీవ్రవ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి మృతి తర్వాత ఆళ్లగడ్డను పీక్కు తినేందుకు కొంతమంది ఏకమయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజల విజ్జత ముందు వారి ఆటలు సాగలేదన్నారు.

వారికి అండగా ఉంటా

వారికి అండగా ఉంటా

తన కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని అఖిలప్రియ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని ఆమె చెప్పారు.

అఖిలప్రియ భావోద్వేగం

అఖిలప్రియ భావోద్వేగం

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తనను కొందరు ఏడిపించే ప్రయత్నం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డిలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.

తరలి వచ్చిన భూమా అభిమానులు

తరలి వచ్చిన భూమా అభిమానులు

భూమా నాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో అఖిలప్రియతో పాటు మంత్రులు ఆదినారాయణ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, భూమా అభిమానులు తరలి వచ్చారు.

భూమా నాగిరెడ్డి

భూమా నాగిరెడ్డి

కాగా, భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకు నాగిరెడ్డి మృతి చెందారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపొందారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh tourism minister Bhuma Akhila Priya in Nagi Reddy death anniversary.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి