నల్లమలలో చరిత్ర అన్వేషణ..! ASI సర్వేకు పవన్ అనుమతి..!

ఏపీ, తెలంగాణ పరిధిలో విస్తరించి ఉన్న సుదీర్ఘ అటవీ ప్రాంతం నల్లమల (Nallamala). పలు జిల్లాల పరిధిలో విస్తరించిన దట్టమైన నల్లమల అడవుల్లో నిగూఢ చారిత్రక ప్రదేశాలు, వారసత్వ సంపద ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు దాన్ని వెలికితీసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి సర్వే చేసేందుకు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇవాళ అనుమతి ఇచ్చారు.

అడవులు జీవ వైవిధ్యంతో పాటు చారిత్రక పురావస్తు, సాంస్కృతిక సంపదకు నిలయాలని, అలాంటి అమూల్యమైన వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించడంతోపాటు మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అటవీ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు, పురావస్తు అవశేషాలు ఎకో టూరిజం అభివృద్ధికి సరికొత్త అవకాశాలు సృష్టిస్తాయన్నారు. ప్రకృతి, వారసత్వ సంపదల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని తెలిపారు. కాబట్టి నల్లమల అటవీ ప్రాంతంలో దాగి ఉన్న అమూల్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించేందుకు, శాసనాల సర్వే నిర్వహించేందుకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)కు అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

Pawan Kalyan Greenlights ASI Survey of Nallamala Forest for Historic and Cultural Heritage Sites

గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో క్రీస్తు పూర్వ 1వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 16వ శతాబ్దం వరకు సుమారు 30 శాసనాలు వెలుగు చూశాయి. 10 వేల సంవత్సరాల నాటి గుహ చిత్రాలను గుర్తించారు. ఈ శాసనాలు శాతవాహనుల కాలం, బౌద్ద, శైవ సంప్రదాయాలతో పాటు ప్రాచీన యాత్రా మార్గాలను, ఆది మానవ జీవన విధానాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాయి. భారత పురావస్తు సంస్థ చేపట్టనున్న తాజా సర్వే తెలుగు, దేవనాగరి లిపుల్లో లిఖించిన శాసనాలపై దృష్టి సారించి మన ప్రాచీన రాజ్యాలు, సంస్కృతి, సంప్రదాయాలు, దక్షిణ భారత చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కల్పించనుంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ లక్ష్యాలకు భంగం కలగకుండా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు సర్వేకు సహకారం అందించాలని పవన్ ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+