చంద్రబాబు నిర్ణయాన్ని విబేధించిన భూమా అఖిల ప్రియ .. కీలక నిర్ణయం ఇదే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పాల్గొనవద్దని ఆయన తేల్చి చెప్పారు . పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సీనియర్ నాయకులు విభేదిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయం కాదని ఇప్పటికే విజయనగరం నేతలు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, అనంతపురం నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు.
మోడీని
చూసి
ప్యాంటు
తడుపుకునే
బ్యాచ్
అవసరమా
?
వైసీపీకి
ఇంకో
గొర్రెను
గెలిపిస్తారా
:
లోకేష్
ధ్వజం
తాజాగా ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టిడిపి నేత భూమా అఖిలప్రియ ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయాన్ని విభేదించిన ఆమె జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు కాబట్టి వారి ఎన్నికల బరిలో ఉన్నారని, గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయాలని కూడా భూమా అఖిలప్రియ సూచించారు. భూమా అఖిల ప్రియ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వెనకడుగు వెయ్యకూడదని పేర్కొన్నారు .

ఇప్పటికే విశాఖను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు టిడిపి అభ్యర్థులు పోటీలో ఉండడాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసి వారికి అండగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా చేరారు. చంద్రబాబు తీసుకున్న ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాబుకు షాక్ ఇచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం నిర్వహించాలని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని భూమా అఖిలప్రియ చెప్తున్నారు.