బ్రహ్మానందరెడ్డి గెలుపుపై భార్య: నీకేం అవసరం.. శిల్పాపై అఖిలప్రియ

టిడిపిని ప్రజలు తప్పక గెలిపిస్తారని భూమా బ్రహ్మానంద రెడ్డి సతీమణి భూమా ప్రతిభ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి తరపున బరిలోకి దిగిన తన భర్త తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నానని చెప్పారు

నంద్యాల: టిడిపిని ప్రజలు తప్పక గెలిపిస్తారని భూమా బ్రహ్మానంద రెడ్డి సతీమణి భూమా ప్రతిభ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి తరపున బరిలోకి దిగిన తన భర్త తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నానని చెప్పారు.

రోడ్లు, శానిటేషన్ మొదలైన సమస్యలను ప్రజలు తన దృష్టికి తెస్తున్నారని తెలిపారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయని, ఉపఎన్నిక తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు.

గెలుపుపై భూమా బ్రహ్మానంద రెడ్డి సతీమణి ధీమా

గెలుపుపై భూమా బ్రహ్మానంద రెడ్డి సతీమణి ధీమా

ప్రజలు తమను చక్కగా స్వాగతిస్తున్నారని, గెలుపుపై ధీమాతో ఉన్నామని భూమా బ్రహ్మానంద రెడ్డి సతీమణి ప్రతిభ అన్నారు. మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Recommended Video

    YS Jagan Shock To Bhuma Akhila Priya
    జగన్‌కు కౌంటర్

    జగన్‌కు కౌంటర్

    తన తండ్రి ఫోటో పెట్టుకొని ప్రచారం చేయడంపై వైసిపి నేతలు ప్రశ్నించడాన్ని మంత్రి అఖిలప్రియ స్పందించారు. జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని ప్రచారం చేసినప్పుడు తాను తన తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

    శిల్పా మోహన్ రెడ్డి వల్లే ఆగిపోయింది

    శిల్పా మోహన్ రెడ్డి వల్లే ఆగిపోయింది

    నంద్యాల ప్రజలందరూ సంతోషంగా ఉంటేనే తన తండ్రి ఆత్మ శాంతిస్తుందని అఖిలప్రియ అన్నారు. శిల్పా మోహన్ రెడ్డి అడ్డు పడటంతోనే ఇన్నాళ్లు అభివృద్ధి పనులు ఆగిపోయి, నేడు జరుగుతున్నాయన్నారు. గతంలో భూమా నాగిరెడ్డి అవినీతిపాలైన 3 వేల ఇళ్లను బయటకు తీశారన్నారు.

    శిల్పా చక్రపాణి రెడ్డికి ఏం అవసరం?

    శిల్పా చక్రపాణి రెడ్డికి ఏం అవసరం?

    శిల్పా చక్రపాణి రెడ్డికి నంద్యాలతో ఏం అవసరమని అఖిలప్రియ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం శిల్పా చక్రపాణి రెడ్డికి ఆడ సర్పంచులు, ఆడ కౌన్సిలర్లు ఓట్లు వేసి గెలిపించారని, వాళ్లు వేయకుంటే ఎలా గెలిచేవారని ప్రశ్నించారు. మహిళల అండతోనే గెలిచి వారిపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. జగన్ వచ్చినప్పుడు బహిరంగ సభలో చక్రపాణి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మనం మగవాళ్లమా, ఆడవాళ్లమా.. మగవాళ్లం అని మాట్లాడారు. దీనిపై అందరూ మండిపడుతున్నారు.

    కక్ష తీర్చుకోవడానికే

    కక్ష తీర్చుకోవడానికే

    జగన్‌ మృతి చెందిన భూమా నాగిరెడ్డి మీద కక్ష తీర్చుకోవడానికి తల్లిదండ్రులు లేని పిల్లలపై తన ప్రతాపం చూపుతున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+