30 మంది టిడిపిలో చేరుతారా? కర్నూల్ నేతల ఖండన

ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సత్తా చాటిన కర్నూలు జిల్లా నుండే అత్యధిక ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కనున్నారని ప్రచారం జరిగింది. కర్నూలు జిల్లా నుండి ఐదారుగురు ఎమ్మెల్యేలు త్వరలో టిడిపిలో చేరుతారన్నారు. వారిలో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఆలూరు ఎమ్మెల్యే జయరాం, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిలు ఉన్నారని, వారు టిడిపి నేతలతో చర్చలు జరిపారని ప్రచారం జరిగింది.
అయితే, అదంతా వట్టిదేనని స్వయంగా పార్టీ మారుతారని ప్రచారం జరిగిన భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డిలు చెప్పారు. తాము జగన్ వెంటే ఉంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేదని చెప్పారు. జగన్ పార్టీ నేత మైసూరా రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీలు టిడిపిలో చేరినప్పటికీ, ఇక ముందు తమ పార్టీ నుండి ఎవరు వెళ్లరని చెప్పారు.
అయితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు, మరో ఐదేళ్ల వరకు కేంద్రంలో, రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగే అవకాశం లేనందున... నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఎస్పీవై రెడ్డి చెప్పారు. ఇదే బాటలో మరికొందరు నడుస్తారని టిడిపి అంటోంది.












Click it and Unblock the Notifications