ఆ కారణంతోనే జగన్‌లో ఆందోళన, అందుకే వస్తున్నారు: భూమా నాగిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత భూమా నాగిరెడ్డి బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత భూమా నాగిరెడ్డి బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టేందుకు జగన్ కర్నూలు వస్తున్నారన్నారు.

ముచ్చుమర్రి ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో రాయలసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి జనబలం పెరిగిపోతుందని జగన్ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

 Bhuma Nagi Reddy

ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్ ఈ రోజు వరకు ఒక్క మంచి ఐడియా కూడా ఇవ్వలేదన్నారు. తనకు ఊహ తెలిసినప్పటినుంచి శ్రీశైలంలో 850 అడుగుల నీటిమట్టం ఉండడం ఇదే ప్రథమమన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా ప్రాంతానికి తేవడంతోనే ఇది సాధ్యమైందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+