ఇదీ జగన్.. అందుకే టిడిపిలో చేరా, అఖిలకు మంత్రి పదవి ఒకే: భూమా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగనే అని టిడిపి నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగనే అని టిడిపి నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇదీ జగన్.. ఎవరి మాట వినరు
జగన్ పెద్దలను గౌరవించరన్నారు. ఎవరి మాట వినరని చెప్పారు. ఆయన ఇతర ప్రజాప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వరని చెప్పారు. జగన్ తీరు నచ్చకే టిడిపిలో చేరానన్నారు. సొంతనిర్ణయాలతో పార్టీకి జగన్ నష్టం కలిగించారని చెప్పారు.

పార్టీ మారేది లేదు
తాను మంత్రి పదవి కోసం టిడిపిలో చేరలేదని చెప్పారు. నంద్యాల అభివృద్ధి కోసమే సైకిల్ ఎక్కానని తెలిపారు. తాను ఇక పార్టీ మారేది లేదని, ఇక రిటైర్‌మెంటే అన్నారు. కర్నూలులో ఫ్యాక్షనిజం పోయి, రౌడీయిజం మొదలైందన్నారు.
చక్రపాణిని గెలిపిస్తాం.. తప్పు జరిగితే..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు. ఏదైనా తప్పు జరిగితే తమ నుంచే జరగాలన్నారు. తాము టిడిపిలోకి రావడాన్ని తప్పే వాళ్ల గురించి మాట్లాడుతూ.. కర్నూలులో పుట్టిన వారంతా పుట్టికతో టిడిపి కాదన్నారు.
శిల్పా సోదరులతో పన్నెండు ఏళ్లుగా వైరం ఉందని చెప్పారు. ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నామని చెప్పారు. ప్రజల కోసమే తమ జీవితం అన్నారు.
అఖిలకు ఇచ్చినా అభ్యంతరం లేదు
తాను మంత్రి పదవి కోసం పార్టీ మారలేదని చెప్పారు. అసలు మంత్రి పదవి వస్తుందో రాదో తెలియదన్నారు. తనకు వచ్చినా, తన కూతురు అఖిల ప్రియకు మంత్రి పదవి వచ్చినా అభ్యంతరం లేదన్నారు. అనుభవానికే ప్రాధాన్యత ఇస్తారనుకుంటున్నట్లు తెలిపారు.
ఎవరిని బుల్డోజ్ చేస్తానో తెలుస్తుంది
గత ఎన్నికల్లో ప్రజలు బెట్టర్ చాయిస్‌గా చంద్రబాబును ఎంచుకున్నారని తెలిపారు. తనకు మంత్రి పదవి వద్దని కర్నూలు నేతలు ఎందుకు చెప్పారో తెలియదన్నారు. తమకు మంత్రి పదవి వస్తే ఎవరిని బుల్డోజ్ చేస్తామో తెలుస్తుందన్నారు. ఆళ్లగడ్డకు రాగలవా అనేది తన ఊతపదమని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశ్యం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications