అసలు మీరేం చేశారు: జగన్ దుమ్ముదులిపిన భూమా నాగిరెడ్డి

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత భూమా నాగిరెడ్డి బుధవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ప్రత్యేక హోదా పేరుతో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

వైయస్ జగన్ యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ప్యాకేజీ తీసుకుంటున్నట్లు చెప్పారు. జగన్‌కు హోదా పైన చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ లేదా ఎంపీలు ఎప్పుడైనా ప్రధానిని కలిశారా అని నిలదీశారు.

 bhuma nagi reddy, ys jagan

అమరావతిలో హస్తకళల గ్రామం

అమరావతిలో హస్తకళల గ్రామం ఏర్పాటు చేసేందుకు కొంతమంది మహిళలు ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టిటిడి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇస్కాన్ కృష్ణుడి మందిరంతో పాటు మసీదు, చర్చిల నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు. రాజధానిలో నిర్మించే భవంతులు, కట్టడాలకు ఏకరూపత ఉండాలన్నారు. నిర్మాణ శైలిలో మన సంస్కృతులు ప్రతిబింబించాలన్నారు.

రాజధానిలో మౌలిక సదుపాయాల పనులను ఆరంభించి వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. టార్గెట్ 2018 అనే కాన్సెప్ట్‌తో పరిపాలన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభఇంచడం ద్వారా అమరావతి నగర నిర్మాణానికి ఊపు, రూపు రావాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+