భూమా ఎవరి ఎమ్మెల్యే? నైతికత గురించి మీరా? ఆయన మనిషైతే పెరిగాడుకానీ..: నిప్పులు చెరిగిన రోజా

తెలుగుదేశం నేతలకు నైతికత, సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మరణించిన భూమా నాగిరెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యేనో స్పీకర్‌ కోడెలను అడిగితే ఆయనే

తిరుపతి: తెలుగుదేశం నేతలకు నైతికత, సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మరణించిన భూమా నాగిరెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యేనో స్పీకర్‌ కోడెలను అడిగితే ఆయనే చెప్తారని పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ సీపీ నేతలకు నీతులు చెప్పే సోమిరెడ్డి, 21 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి నీతుల మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. పదవుల కోసం తల్లిలాంటి పార్టీని మారిన చరిత్ర ఆదినారాయణ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డిలదని విమర్శించారు.

పార్టీ మారిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకొనే ఉద్దేశం తమ పార్టీ అధినేతకు లేదని, పార్టీ మారిన నేతలు తిరిగి వస్తామని అడిగినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించలేదని తెలిపారు.

నైతికత గురించి మీరా మాట్లాడేది?

నైతికత గురించి మీరా మాట్లాడేది?

నందిగామ ఎమ్మెల్యే చనిపోతే వైఎస్‌ఆర్‌ సీపీ పోటీపెట్టలేదని రోజా తెలిపారు. నైతికత గురించి మాట్లాడే టీడీపీ నేతలు నంద్యాలలో వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మరణిస్తే మాత్రం ఎందుకు పోటీపెడుతున్నారని ప్రశ్నించారు.

ఆయన మనిషైతే పెరిగాడుకానీ...

ఆయన మనిషైతే పెరిగాడుకానీ...

అచ్చెన్నాయుడు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. తనకు అనుకూలంగా లేని 120 మంది కళింగ ఉద్యోగులను కక్షపూరితంగా పలు ప్రాంతాలకు బదిలీ చేయించిన వ్యక్తి అచ్చెన్నాయుడు అని ఆమె విమర్శించారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు...

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు...

తెలుగుదేశం మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, టీడీపీ మంత్రుల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటున్నాయని రోజా ఎద్దేవా చేశారు. మంత్రులనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేతలపై ఆమె నిప్పులు చెరిగారు.

అధికారం కోసం 32 కులాల మధ్య చిచ్చు...

అధికారం కోసం 32 కులాల మధ్య చిచ్చు...

కులాల పేరుతో రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మండిపడ్డారు. అధికారం కోసం 32 కులాల మధ్య చిచ్చుపెట్టారని విమర్శంచారు. కులం చూసే ఏపీ డీజీపీ సాంబశివరావుకు పూర్తి స్థాయిలో అధికారాలు, బాధ్యతలు అప్పగించలేదన్నారు.

ప్రతి మాటకు జగన్ సమాధానం చెబుతారు...

ప్రతి మాటకు జగన్ సమాధానం చెబుతారు...

ఆగస్టు మూడో తేదీ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాలలో పర్యటిస్తారని రోజా తెలిపారు. టీడీపీ నేతలు చేసే ప్రతి మాటకు ఆయన సమాధానం చెబుతారన్నారు. నంద్యాల ప్రజలు తెలుగుదేశం నాయకుల డ్రామాలను గమనిస్తున్నారని, ఉప ఎన్నికల్లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+