'తన ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా?'

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్టు తరలిపోతుంటే చంద్రబాబు దానిని ఆపకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Bhumana Karunakar Reddy

ఏపీలో ఉన్న మిగతా పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయని ఆయన దుయ్యబట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఆనాడు ఎంతో క‌ష్ట‌ప‌డి మన్నవరం ప్రాజెక్ట్‌ను సాధించారని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వల్ల పరిశ్రమలు వస్తాయని చెబుతున్న టీడీపీ నేతల మాటలన్నీ వట్టి భూటకమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని త‌మ పార్టీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నార‌ని, తన ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+