లడ్డు ఆరోపణలపై తిరుమలలో భూమన ప్రమాణం..!!
తిరుమల లడ్డు వివాదంపై మాజీ చైర్మన్ భూమన ప్రమాణానికి సిద్ధమయ్యారు. తమ హయాంలో లడ్డు ప్రసాద విషయంలో అపచారం జరిగిందని ఆరోపణ పైన ఆయన తిరుమలలో స్పందించారు. ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలకు అవకాశం లేకుండా వ్యవహరించాలని భూమనకు పోలీసులు ఆదేశించారు. ఆ తర్వాత తిరుమల లో హారతి ఇస్తూ భూమన తాము ఎటువంటి తప్పు చేయలేదంటూ చెప్పుకొచ్చారు.
తిరుమల లడ్డు విషయంలో టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు చేరుకునే ముందు ఆయనతో పాటుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి నుంచి ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తిరుమల చేరుకున్న భూమన పుష్కరిణిలో స్నానం చేశారు. అనంతరం అఖిలాండబద్ద కర్పూర నీరాజనం అందించారు. హారతి వెలిగించి తాను ఎటువంటి తప్పు చేయలేదని.. రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వాడుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

తాము ఏ పొరపాటు చేసిన తన కుటుంబం మొత్తం సర్వ నాశనం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. భూమన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. పోలీసులు తీసుకువెళ్తున్న సమయంలోనే భూమితో పాటు ఆయన మద్దతుదారులు గోవింద నామం స్మరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. టిటిడి మరో మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సైతం తాను దేవదేవుడు ముందు ప్రమాణానికి సిద్ధమని ఇప్పటికే స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి ఇప్పటికే హైకోర్టు తో పాటు సుప్రీంకోర్టులో లడ్డు వివాదంపై విచారణ చేపట్టాలని పిటిషన్లు దాఖలు చేశారు.
తప్పు చేసిన వాడు నాశనమే. తిరుమలలో భూమన సంచలనం!#BhumanaKarunakarReddy #TirumalaLaddu #TirupatiLaddu #ChandrababuNaidu #YSJagan #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/p0YKSUjXon
— oneindiatelugu (@oneindiatelugu) September 23, 2024
బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం ఇదే అంశం పైన సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. లడ్డు వివాదం పైన విచారణ చేయించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదం పైన సీట్ ఏర్పాటు చేసింది. తిరుమలలో మహాయాగం నిర్వహించారు. ఈ సాయంత్రం భక్తులంతా దీపారాధన సమయంలో క్షమా మంత్రం పఠించాలని ఈవో శ్యామలరావు సూచించారు.












Click it and Unblock the Notifications