వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజన: పేరు మార్పు, రీల్ ఫైట్ ప్రారంభం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలుగు సినీ రంగంలో వివాదం ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తంపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికే అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ర్ కామర్స్ తన పేరును తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్‌గా మార్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే, దానికి తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఆటంకంగా మారినట్లు కనిపిస్తోంది.

నిబంధనల ప్రకారం - చిత్ర నిర్మాత తన చిత్రం పేరును మొదట ఫిల్మ్ చేంబర్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిల్మ్ చేంబర్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అతను సెన్సార్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఒసి ప్రాతిపదికపై నిర్మాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను పొందుతాడు.

Bifurcation of Andhra Pradesh: Now, the ‘reel’ fight begins

ఈ నెల 2వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడడంతో ఎటువైపు ఉండాలనే విషయాన్ని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి నిర్మాతలకు వచ్చింది. తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేసుకుని, ఎన్ఒసి పొందేవాళ్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు లేదా సబ్సిడీలకు అర్హులవుతారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు పొందాలని భావించేవారు ఎపి ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా ఎన్ఒసి పొందాల్సి ఉంటుంది. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్‌ను గుర్తించకూడదని తెలంగాణ ప్రభుత్వానికి, చలనచిత్ర అభివృద్ధి సంస్థకు విజ్ఞప్తి చేయాలని తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అనుకుంటోంది.

నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు, స్టూడియో సెక్టార్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటి వరకు పూర్తిగా తలెత్తుకుని వ్యవహరించలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో అది పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంది.

English summary
The first dispute following the bifurcation of Andhra has cropped up in the multi-crore Telugu film industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X