కోటంరెడ్డికి బూమ్ రాంగ్ - ఫోన్ ట్యాపింగ్ అంశంలో భారీ ట్విస్ట్..!!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకు ఊహించని షాక్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకు ఊహించని షాక్. ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయించందంటూ చేసిన ఆరోపణలు కొత్త టర్న్ తీసుకున్నాయి. తాను తన స్నేహితుడు రామ శివారెడ్డితో మాట్లాడిన మాటలు ట్యాపింగ్ చేసారంటూ కోటంరెడ్డి ఆరోపించారు. తాను - తన స్నేహితుడు ఐ ఫోన్ వినియోగిస్తున్నామని..అందులో రికార్డింగ్ అవకాశం ఉండదని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తమ సంభాషణలను తనకు వాయిస్ మెసేజ్ పంపారని కోటంరెడ్డి వెల్లడించారు. ఖచ్చితంగా అది ట్యాపింగ్ అని కోటంరెడ్డి బలంగా చెప్పారు. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కోటంరెడ్డి లేఖ రాసారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగింని..విచారణ జరిపించాలని కోరారు.

ట్యాపింగ్ కాదు..రికార్డింగ్
కోటంరెడ్డి వైసీపీని వీడటానికి..ప్రభుత్వం పైన విమర్శలకు ప్రధాన కారణం తన ఫోన్ ట్యాపింట్ అవ్వటమేనని చెప్పుకొచ్చారు. తన చిన్ననాటి స్నేహితుడు రామ శివారెడ్డితో తాను మాట్లాడిన మాటలను..ఆ తరువాత సీనియస్ ఐపీఎస్ అధికారి తనకు వాయిస్ మెసేజ్ ద్వారా పంపారని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
కోటంరెడ్డి చెప్పిన స్నేహితుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. కోటంరెడ్డి తనతో కాంట్రాక్టుల విషయంతో పాటుగా రాజకీయాల గురించి మాట్లాడారని చెప్పుకొచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడిన మాటలే మరోసారి తనతో చెప్పారని రామ శివారెడ్డి వివరించారు. తన ఫోన్ లో ప్రతీ కాల్ ఆలోమేటిక్ గా రికార్డు అవుతుందని..తాను మరో కాంట్రాక్టర్ కు షేర్ చేయటంతో అది వైరల్ అయిందని రామ శివారెడ్డి చెప్పుకొచ్చారు.

విచారణకు సిద్దమంటున్న కోటంరెడ్డి స్నేహితుడు
తన ఫోన్ లో నాలుగు నెలల నుంచి రికార్డు అయిన కాల్ డేటాను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ఏ విచారణ సంస్థ అడిగినా తాను ఆ వివరాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. కోటంరెడ్డి ఎందుకు ట్యాపింగ్ జరిగినట్లుగా చెబుతున్నారో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. కేంద్ర విచారణ సంస్థలు..ఫోరెన్సిక్ కు తన ఫోన్ ఇవ్వమని చెప్పినా తాను సిద్దమేనని స్పష్టం చేసారు.
తాను సహచర కాంట్రాక్టర్ కు ఆ ఫోన్ సంభాషణ షేర్ చేయటంతో బయటకు వచ్చిందని వివరించారు. కోటంరెడ్డి దీనిని ప్రభుత్వ ట్యాపింగ్ గా ప్రచారం చేయటంలో వాస్తవం లేదన్నారు. తాను ఉద్దేశ పూర్వకంగా కాంట్రాక్టర్ కు పంపలేదని.. అది తరువాత వైరల్ అవుతుందని ఊహించలేదన్నారు. తాను ఎవరి ప్రోద్బలంతో..ఎవరి ఒత్తిడితో ఈ విషయాలు చెప్పటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను వైఎస్సార్ భక్తుడినని..ప్రభుత్వం సంబంధం లేని ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.

అమిత్ షాకు కోటంరెడ్డి ఫిర్యాదు.. ట్యాపింగ్ కాదంటూ
ఎమ్మెల్యే కోటంరెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిందని..విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరారు. అవకాశం ఇస్తే ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేస్తానని కోటంరెడ్డి వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే కోటంరెడ్డి తన స్నేహితుడితో అది ట్యాపింగ్ కాదని చెప్పిస్తారని చెప్పుకొచ్చారు.
కానీ, కోటంరెడ్డి మిత్రుడు మాత్రం తనను ఎవరూ కలవలేదని.. జరుగుతున్న వివాదం చూసి తానే ఈ విషయం పైన క్లారిటీ ఇస్తున్నానని స్పష్టం చేసారు. అదే సమయంలో తన ఫోన్ ను ఏ విచారణ..ఫోరెన్సిక్ కు ఇవ్వటానికి సిద్దమని చెప్పటం ద్వారా కోటంరెడ్డి చేసిన ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. మిత్రుడు రామ శివారెడ్డి ఇచ్చిన క్లారిటీ పైన ఇప్పుడు ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications