ఏపీ ఉచిత బస్సు పథకం.. ఏపీఎస్ఆర్టీసీ దశ మారిపోతుంది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే క్రమంలో తాజాగా ఆగస్టు 15వ తేదీ నుండి స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు జీరో టికెట్ తో వారిని వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ స్త్రీ శక్తి పథకానికి మహిళల నుండి విశేషమైన స్పందన వస్తోంది.

బస్సులలో పెరిగిన ప్రయాణికులు
ఈ పథకం ఏపీఎస్ఆర్టీసీకి పునర్వైభవాన్ని తీసుకొస్తోంది.స్త్రీ శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో వెలవెల పోయిన గ్రామీణ ప్రాంతాలలోను, నగరంలోనూ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు కళకళలాడుతున్నాయి. ఏ ఊర్లో చూసిన బస్సులెక్కి ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో apsrtc మీద నిర్లక్ష్యం చూపించారని, ఫలితంగా అనేక గ్రామాలకు బస్సు సేవలు నిలిచిపోయాయని ప్రభుత్వం అంటోంది.

big boost and apsrtc revival with free bus travel

Take a Poll

ఆర్టీసీకి అలా బూస్ట్ ఇస్తున్న కూటమి సర్కార్
చాలా గ్రామాల ప్రజలు ఆటోల మీదనే ఆధారపడి ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని అంటుంది. గత వైసీపీ సర్కారు చర్యలతో కుదేలైన ప్రజారవాణా వ్యవస్థను తిరిగి పునరుజ్జీవం నింపి ముందుకు తీసుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టి, జీరో టికెట్టు తో మహిళలకు బస్సు సేవలను అందించి, ఆ డబ్బులను ఏపీఎస్ఆర్టీసీ కి కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఆర్టీసీకి ఊతమిస్తున్న కూటమి సర్కార్
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆర్టీసీని ఈ విధంగా కూటమి ప్రభుత్వ చర్యలు గట్టెక్కిస్తున్నాయి అనేది ప్రభుత్వ వాదన. స్త్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో... వెలవెలబోయిన గ్రామీణం, నగరాల్లోని ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులు కళకళలాడుతున్నాయి. గతంలో ఆర్టీసీ గ్రామీణ ప్రాంత బస్సులు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో డిపోలకే పరిమితమయ్యాయి.

స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన
అవసరమైన రూట్లలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి సమస్యను పరిష్కరించాల్సి ఉంది పోయి ప్రైవేట్ వాహనాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వటంతో ఐదేళ్లలో అనేక గ్రామాలకు బస్సు లేని కారణంగా పరిమితికి మించి ఆటోలో ప్రయాణాలు చేయవలసి వచ్చింది. దీంతో జరిగిన ప్రమాదాలకు లెక్కేలేదు.సురక్షిత ప్రయాణాన్ని అందించడం ఆర్టీసీకి ఊపిరి పోయడమే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన స్త్రీ శక్తి పథకానికి విశేష స్పందన దక్కుతుంది.

RTCకి పూర్వపు కళను తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ
ఉచిత బస్సులతో పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం కాగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు అందిస్తున్న రాయితీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఏటా... 2 వేల కోట్లకు పైగా RTCకి తిరిగి చెల్లించనుండటంతో apsrtc కి రాబడి గణనీయంగా పెరుగనుంది. RTCకి పూర్వపు కళను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+