బాలయ్య హ్యాట్రిక్ గెలుపుకు దీపిక బ్రేక్..!?
టీడీపీ కంచుకోట హిందూపురం. టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ వేరే పార్టీకి చోటే లేదు. నందమూరి కుటుంబాన్ని ఇక్కడి ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు. వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సినీ హీరో నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. ఈ సారి వైసీపీ హిందూపురం పైన ప్రత్యేక ఫోకస్ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి ఆపరేషన్ హిందూపురం అమలు చేసారు. అక్కడ దీపిక వైసీపీ నుంచి పోటీ చేసారు. ఈ సారి హిందూపురం ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
హిందూపురంలో ఈ సారి ఎలాగైనా బాలయ్యను ఓడించాలనేది వైసీపీ లక్ష్యం. అందుకోసం సామాజిక లెక్కలను పరిగణలోకి తీసుకొని మహిళా అభ్యర్దిని బరిలోకి దించారు. బాలయ్య గతం కంటే ఈ సారి ఎన్నికల్లో కష్టపడాల్సి వచ్చింది. సులువుగా గెలిచే సీటులో వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. వైసీపీలో గ్రూపులు ఉండటంతో సమన్వయం దెబ్బతింది. బాలయ్య..గతంలో టీడీపీ హాయంలో నియోజకవర్గంలో చేసిన పనులు అదనపు బలంగా మారాయి. తొలి నుంచి హిందూపురంలో ఓటర్లు నందమూరి కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నట్లే...ఈ సారి అండగా నిలిచారు.

మంత్రి పెద్దిరెడ్డి ప్రతీ నెలా హిందూపురంలో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ నేతలకు నియోజకవర్గంలో మండలాల వారీగా బాధ్యతలు కేటాయించారు. కుప్పంతో పాటుగా హిందూపురం లో గెలుపు బాధ్యతలను పెద్దిరెడ్డి తీసుకున్నారు. దీపికికు సహకరించాలని పార్టీ నేతలకు సూచించారు. అయితే, ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీలో సమన్వయం కొరవడినట్లు కనిపించింది. పోలింగ్ సరళి పైన రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, టీడీపీకి సాంప్రదాయ బద్దంగా ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు మద్దతిచ్చినట్లు గుర్తించారు. సంక్షేమ పథకాల లబ్దిదారులు, గ్రామీణ ఓటర్ల పైన వైసీపీ ఆశలు పెట్టుకుంది. దీంతో..రెండు వైపులా ధీమా వ్యక్తం అవుతున్న సమయంలో హిందూపురంలో ఫలితం పైన ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications