వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి కష్టం చూడలేదు: లోకేష్‌ను చుట్టుముట్టిన మహిళలు

తెలుగుదేశం పార్టీ జాతీయ కన్వీనర్ నారా లోకేష్ పర్యటనలో ఆయనను చుట్టుముట్టిన మహిళల తమ కష్టాలను వినిపించారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: పెద్ద నోట్ల రద్దై నెల రోజులు గడుస్తున్నా నగదు కోసం ప్రజలు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కన్వీనర్ నారా లోకేష్ పర్యటనలో ఆయనను చుట్టుముట్టిన మహిళల తమ కష్టాలను వినిపించారు.

'ఖాతాల్లో నగదు ఉన్నా అవసరా నికి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పింఛను సొమ్ము కోసం వయస్సు పైబడినా గంటల తరబడి క్యూలో ఉన్నా ఫలితం లేదు. ఇలాంటి కష్టం ఎన్నడూ చూడలేదు' అంటూ వృద్ధు లు, మహిళలు.. లోకేష్‌ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.

Big notes ban: women complains to Lokesh

బుధవారం చిలకలూరిపేట పర్యటనకు వచ్చిన లోకేష్‌.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి జాతీయ రహ దారి పక్కన ఉన్న ఇండియన్ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా నగదు కష్టాల గురించి క్యూలైనలో ఉన్న మహిళలను, వృద్ధులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన రెండో విడత డ్వాక్రా రుణమాఫీ సంబంధించి అందచేసిన పత్రాలను సైతం బ్యాంకుల్లో అధికారులు తీసుకోవడం లేదని వారు వాపోయారు. 20 నిమిషాల పాటు వారి సమస్యలను విన్నారు నారా లోకేష్. అనంతరం బ్యాంకు సిబ్బంది బయటకు వచ్చి.. ఈ రోజు బ్యాంకుకు వచ్చిన రూ.6 లక్షలు పంపిణీ చేసినట్లు లోకేష్‌కు తెలిపారు.

English summary
some women have complainted to TDP leader Nara Lokesh on cash problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X