Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎవరు టార్గెట్ చేసినా పవన్ కళ్యాణ్ ఓటమిపైనే..తాజాగా మంత్రి ధర్మాన వ్యాఖ్యలు; జనసేనకు పెద్ద కష్టమే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పార్టీ మనుగడ కోల్పోతుందా? ఇక పవన్ కళ్యాణ్ ను అధికార పార్టీ నేతలు రాజకీయాలలో పనికి రాడని తీసిపారేస్తున్నారా ? అధికార వైసీపీపై రాష్ట్ర ప్రజల సమస్యల కోసం పోరాడటంలో కూడా జనసేన పార్టీ ఫెయిల్ అవుతుందా ? పవన్ కళ్యాణ్ ను ఎన్నికల్లో ఓటమి వదలకుండా పట్టి పీడిస్తుందా ? నేటికీ నేతలు ఎవరు పవన్ ను టార్గెట్ చేసినా ఓటమినే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

గత ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ పార్టీ

గత ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యల కోసం పెద్దఎత్తున పోరాటం చేశారు. గతంలో ప్రజా రాజ్యం తరహాలో పవన్ పార్టీ రావటంతో చిరంజీవి పార్టీని, పవన్ పార్టీని ఒకటే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని విలీనం చేసినట్టే పవన్ కూడా చేస్తారని ప్రచారం జరిగింది . అదంతా తట్టుకుని పవన్ రాజకీయాల్లో ముందుకు వెళ్ళినా జనసేన పార్టీ ప్రజల్లో పట్టు సాధించలేకపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన దారుణంగా ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

 రాజకీయాలపై గట్టిగా ఫోకస్ చెయ్యని పవన్ కళ్యాణ్

రాజకీయాలపై గట్టిగా ఫోకస్ చెయ్యని పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలు పెడితే విపరీతమైన క్రేజ్ తో పవన్ కళ్యాణ్ ను చూడడానికి వచ్చిన జనాలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను ఆదరించలేదు. ఫలితంగా రెండు స్థానాల్లో ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు . విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గం నుండి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు.

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉంటారని భావిస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాలు సాగిస్తానని తేల్చి చెప్పారు. అప్పటి నుండి ఇప్పటివరకు రాజకీయాల్లో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టి రాజకీయాలు చెయ్యటం లేదన్న భావన ఏపీలో వ్యక్తం అవుతుంది .

సినిమాలు, రాజకీయాలు రెండు పడవలపై కాళ్ళు పెట్టిన జనసేనాని

సినిమాలు, రాజకీయాలు రెండు పడవలపై కాళ్ళు పెట్టిన జనసేనాని

2014 ఎన్నికల సమయంలోనే పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుతాడు అని భావిస్తే కనీసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా విజయం దక్కకపోవడం జనసేన పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. సినిమాల్లో లక్షల సంఖ్యలో పవన్ కళ్యాణ్ ను ఆదరించిన అభిమానులు, రాజకీయాల్లో మాత్రం పెద్దగా పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేసిన పరిస్థితులు కనిపించలేదు.

పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలకే పరిమితం కాకుండా, సినిమాలను చేస్తూ మధ్య మధ్యలో రాష్ట్రంలో సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. సినిమాలు, రాజకీయాలు రెండు పడవలపై కాళ్ళు పెట్టిన జనసేనాని రాజకీయాల్లో బాగా వెనుకపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువగా మారుతున్నాయి.

జనసేన నుండి గెలిచిన ఎమ్మెల్యే జగన్ భజన .. పవన్ అంటే లెక్క లేని పరిస్థితి

జనసేన నుండి గెలిచిన ఎమ్మెల్యే జగన్ భజన .. పవన్ అంటే లెక్క లేని పరిస్థితి

ఇక జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసిపి భజన చేయడంతో, వైఎస్ జగన్ కు అనుకూలంగా మాట్లాడటంతో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే అన్న పరిస్థితి నెలకొంది. దీంతో పార్టీ నుండి అసెంబ్లీ లో ప్రశ్నించే వారు కూడా లేని పరిస్థితి జనసేన పార్టీ లో చోటుచేసుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ ఏది ప్రశ్నించినా వైసీపీ సర్కార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇదే సమయంలో బి.జె.పి.తో జత కట్టిన జనసేన పార్టీ ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున పని చేస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇక ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది జనసేన పార్టీ .

పవన్ కళ్యాణ్ ఓటమిని ప్రస్తావించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

పవన్ కళ్యాణ్ ఓటమిని ప్రస్తావించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్


ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేసినంతగా, ఇప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాటం కూడా చేయడం లేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ ను రాజకీయాల విషయంలో తీసి పారేస్తున్న ధోరణి కనిపిస్తుంది. ఇక తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ . శ్రీకాకుళం పట్టణంలో చేనేత బజార్ ప్రారంభ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాష్ట్రమంతా తిరిగి రెండు ప్రాంతాలలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు అంటూ ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న డిప్యూటీ సీఎం

పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న డిప్యూటీ సీఎం


పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి యాక్టర్ అంటూ పేర్కొన్నారు ధర్మాన కృష్ణ గారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ జగన్ మోహన్ రెడ్డి తో పోల్చుకోవద్ద్దని చెప్పారు . జగన్ ఆయనకు ఆయనే సాటి అని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. అటు పవన్ కళ్యాణ్ ఆలోచించి మాట్లాడితే మంచిదంటూ ధర్మాన కృష్ణదాస్ హితవుపలికారు. ఒక్క ధర్మాన కృష్ణదాస్ మాత్రమే కాదు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎవరు విమర్శించాలన్నా భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు అని టార్గెట్ చేయడమే ప్రధానంగా కనిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+