రఘురామరాజుకు భారీ ఊరట-అరెస్టు చేయొద్దన్న హైకోర్టు- కేసులపై జడ్డి ఆశ్చర్యం
ఏపీలో వైసీపీ సర్కారుతో ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు పెట్టిన కేసులపై హైకోర్టును ఆశ్రయించిన రఘురామరాజుకు తాత్కాలికంగా ఊరట దొరికింది. అదే సమయంలో కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వైసీపీ ప్రభుత్వంపై ఏడాదిన్నరగా నిత్యం విమర్శలకు దిగుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వివాదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, సొంత నియోజకవర్గానికి రావడం లేదని, ఇలా పలు అంశాలపై ఫిర్యాదులు చేశారు. వీటిపై స్పందించిన నరసాపురం పరిధిలోని పోలీసులు వివిధ స్టేషన్లలో కేసులు పెట్టారు. వీటిపై రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మానవేంద్రరాయ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం... విచారణ పూర్తయ్యే వరకూ ఆయన్ను అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామపై అన్ని కేసులు, ఒకే విధంగా ఎలా నమోదు చేస్తారని పోలీసుల్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ప్రభుత్వం తరఫున హాజరయ్యేందుకు న్యాయవాది ఎన్‌ఎస్ ప్రసాద్‌కు అనుమతి ఇవ్వడంపైనా రఘురామ లాయర్ ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications