Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ డిప్యూటీసీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్.. కులవివాదంపై అప్పిలేట్ అధారిటీ కీలకఉత్తర్వుతో ఊరట

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కులం విషయంపై ఊరట లభించింది. పుష్ప శ్రీవాణి కులం కేసుకు సంబంధించి హై కోర్టు నియమించిన అప్పిలేట్ అథారిటీ ఆమెకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. పుష్ప శ్రీవాణి షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గానికి చెందినవారని, ఆమె కులం కొండదొర అని అప్పిలేట్ అథారిటీ బుధవారం ధృవీకరించింది.

పుష్ప శ్రీవాణి కులంపై ఆరోపణలు

పుష్ప శ్రీవాణి కులంపై ఆరోపణలు

ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే కుల వివాదం ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ రాజకీయాలలో దుమారం రేపింది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పుష్ప శ్రీ వాణి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.

జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకుని ఆమెకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో పుష్ప శ్రీ వాణి ఎస్టీ కాదని ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ ఏ విధంగా కేటాయిస్తారని ఆరోపణలు మొదలయ్యాయి.

ఎస్టీ కాకుండా గిరిజన శాఖ కేటాయించారని దుమారం

ఎస్టీ కాకుండా గిరిజన శాఖ కేటాయించారని దుమారం

జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపించారు. ఆమె కులానికి సంబంధించినటువంటి కేసు కోర్టు విచారణలో ఉందని, అలాంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ మంత్రివర్గంలోకి ఏవిధంగా తీసుకుంటారని ఆందోళన చేశారు.

ఎన్నికల అఫిడవిట్ లో అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న నిబంధన ఉన్నా పుష్ప శ్రీ వాణి 2013 నామినేషన్ సమయంలోపాత ధృవీకరణ పత్రాన్ని మళ్ళీ సమర్పించారని ఆరోపించారు. ఇక దానిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

పుష్ప శ్రీ వాణి సోదరి రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన అనంతరం ఆమె ఎస్టీ కాదని విచారణ జరిపి పార్వతీపురం ఐటిడిఎ పిఓ నిర్ధారించారని, ఇక సోదరి ఎస్టీ కాకుంటే పుష్ప శ్రీ వాణి ఎస్టీ ఏ విధంగా అవుతుంది అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

అనర్హత వేటు వెయ్యాలని, మంత్రి వర్గం నుండి తొలగించాలని కోర్టు మెట్లెక్కిన పలువురు

అనర్హత వేటు వెయ్యాలని, మంత్రి వర్గం నుండి తొలగించాలని కోర్టు మెట్లెక్కిన పలువురు

పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి, ఆమె తనను తాను ఎస్టీగా పేర్కొంటూ నకిలీ సర్టిఫికెట్‌ను సమర్పించిందని, ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని, శాసనసభకు అనర్హత వేటు వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘం, ఏపీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, బుట్టాయగూడెం తహశీల్దార్‌లకు ఏపీ హైకోర్టు 2021 ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు అప్పిలేట్ అథారిటీ ఆమె కుల స్థితిపై విచారణ చేపట్టింది.

పుష్ప శ్రీవాణి ఎస్టీనే .. తేల్చిన అప్పీలేట్ అథారిటీ

పుష్ప శ్రీవాణి ఎస్టీనే .. తేల్చిన అప్పీలేట్ అథారిటీ

పుష్పశ్రీవాణి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని పిటిషన్‌ దాఖలు చేసిన రిటైర్డ్‌ టీచర్‌ కె.మణి, రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏపీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీలేట్ అథారిటీ ద్వారా విచారణకు ఆదేశించింది ఏపీ హైకోర్టు . అప్పీలేట్ అథారిటీ విచారణ జరిపి ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినదని, అనంతరం ఆమె ఎస్టీ అని తేలడంతో పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ దొరికినట్టయ్యింది .

Recommended Video

    అమ్మాయిలూ.. ప్రమాదంలో ఉన్నప్పుడు 112,100,1090, 181, 1091 లలో ఏదో ఒకదానికి ఫోన్ చేయండి || Oneindia
    ఇదంతా ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ చేసిన కుట్ర అన్న పుష్ప శ్రీవాణి

    ఇదంతా ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ చేసిన కుట్ర అన్న పుష్ప శ్రీవాణి

    అప్పిలేట్ అథారిటీ తనను ఎస్టీగా నిర్ధారించిన తర్వాత, పుష్ప శ్రీవాణి 2014 నుండి తనపై టీడీపీ కులానికి సంబంధించిన కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిస్పందించారు. గతంలో కోర్టులు ఆ పిటిషన్లను తిరస్కరించిన తర్వాత కూడా టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ కేసులు దాఖలు చేస్తున్నారని, కావాలని తనను ఇబ్బంది పెట్టటం కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. ఇక అప్పిలేట్ అథారిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం పుష్ప శ్రీవాణి కులాన్ని ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+